ఆమె పేరు బోగ నిర్మల. వయసు 29 ఏళ్లు. విశాఖపట్నంలోని రామజోగిపేటకు చెందిన ధర్మరాజుతో నిర్మలకు గతంలో వివాహం జరిగింది. గత కొంత కాలం పాటు ఈ దంపతులు ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలోనే ఓ కుమారుడు కూడా జన్మించాడు. పుట్టిన బిడ్డతో ఈ దంపతులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఈ నెల 18న ఉదయం 6 గంటలకు 9 ఏళ్ల వయసున్న బిడ్డను ఇంట్లో వదిలేసి ఆ తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఇది కూడా చదవండి: అసలు వీడు భర్తేనా..? కన్న పిల్లల ముందే భార్యపై భర్త దారుణం!
కొడుకు ఏడుస్తుండడం, భార్య ఇంట్లో లేకపోవడంతో భర్త ఒక్కసారిగా ఖంగారుపడ్డాడు. కాసేపు అటూ ఇటూ అంతా వెతికాడు. ఎక్కడా కూడా భార్య నిర్మల ఆచూకి దొరకలేదు. బంధువుల ఇంటికి ఫోన్ చేసి భార్య సమాచారం గురించి అడిగి తెలుసుకున్నాడు. బంధువుల ఇంట్లో కూడా భార్య లేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే భర్త ధర్మరాజుకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే స్థానిక పోలీసులకు నా భార్య నిర్మల కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక ఎవరికైనా నిర్మల ఆచూకి దొరికితే 0891–2746866, 9440796010 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని పోలీసులు కోరారు. నిన్నటి వరకు సంతోషంగా నిర్మలకు పాపం.. ఏం కష్టం వచ్చిదో అని స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.