ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతూ మహిళలను భయందోళనలకు గురి చేస్తున్నారు. అయితే వరుస ఘటనలు మరువకముంతే తాజాగా విశాఖలో కొందరు చైన్ స్నాచర్లు పట్టపగలు రెచ్చిపోయారు.
గత కొంత కాలం నుంచి హైదరాబాద్ జంట నగరాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రోడ్లపై ఒంటరిగా ఉన్న పెళ్లైన మహిళలనే టార్గెట్ చేసుకుని వారి మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడులను తెంపుకుని తుర్రుమంటూ అక్కడి నుంచి పరారవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా చోట్ల జరిగాయి. అయితే ఈ వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు మరువకముందే తాజాగా ఏపీలో కొందరు దొంగలు రెచ్చిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని విశాఖపట్నం జిల్లా అక్కెయపాలెంలో తాజాగా ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఈమెను కొందరు చైన్ స్నాచర్లు గమనించారు. ఎలాగైన ఆమె మెడలో ఉన్న బంగరు గొలుసును దొంగిలించాలని పథకం వేశారు.
అనుకున్నట్లుగానే ఆ యువకులు మెల్లగా ఆమె వెనకాల నుంచి బైక్ పై వెళ్లారు. ఇక క్షణాల్లోనే ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో ఆ మహిళ కిందపడి తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో ఆమెకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. వెంటనే స్థానికులు గమనించి ఆ మహిళను లేపి ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగల కోసం గాలిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విశాఖలో పట్టపగలు రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.