స్థలం అనేది పెట్టుబడులకు స్వర్గధామం. పెట్టుబడి పెట్టిన అతి తక్కువ కాలంలోనే విపరీతంగా పెరిగిపోతుంది. వైజాగ్ లోని ప్రముఖ ప్రాంతాల్లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
వైజాగ్ నగరం ఫాస్ట్ గా డెవలప్ అవుతోంది. ఫ్లాట్ కొనాలన్నా, ఇండ్ల స్థలం కొనాలన్నా గానీ మీకు ఇదే మంచి అవకాశం. అభివృద్ధి అయ్యాక భూముల ధరలకు రెక్కలు వచ్చేస్తాయి. కాబట్టి అభివృద్ధి చెందే సమయంలోనే కొనుక్కు పెట్టుకుంటే మిగులులో ఉంటారు. ఇండ్ల స్థలాల మీద పెట్టుబడి పెట్టడం లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ లో పెట్టుబడి పెట్టడం.. ఈ రెండిటికీ వైజాగ్ నగరం అనుకూలంగా ఉందా? లేదా? ప్రస్తుతం వైజాగ్ లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల గణాంకాల ప్రకారం ఇండ్ల స్థలాల ధరలు ఎలా ఉన్నాయి? అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ ధరలు ఎలా ఉన్నాయి? ఏ ఏరియాల్లో స్థలాలు వృద్ధి చెందుతున్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం.
పైన తెలుపబడిన ఏరియాల్లో ఇండ్ల స్థలాలకైనా, అపార్టుమెంటులో ఫ్లాట్ కైనా వృద్ధి రేటు అనేది కొన్ని చోట్ల బాగా పెరగగా, మరికొన్ని చోట్ల తగ్గింది. అపార్టుమెంటులో ఫ్లాట్ కొనాలంటే 150 చదరపు గజాలకు గాను యావరేజ్ గా రూ. 41,68,800 నుంచి రూ. 1,01,10,150 వరకూ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే 40 లక్షల నుంచి కోటి పైనే ఉంది. ఇక ఇండ్ల స్థలాలకైతే పైన తెలుపబడిన ప్రాంతాల్లో 150 చదరపు గజాలకు గాను రూ. 11,12,550 నుంచి రూ. 58,22,100 వరకూ అవుతుంది. అంటే దాదాపు రూ. 12 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకూ ఉంది. ఇవి 2023 జనవరి నుంచి మార్చి వరకూ ఉన్న మార్కెట్ గణాంకాల ప్రకారం ఇవ్వబడిన సమాచారం. ఈ ధరలు మీకు అవగాహన రావడం కోసం తెలుపబడినవి.
గమనిక: ఈ ధరలు కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అసలు ఖచ్చితమైన ధరల కోసం రియల్ ఎస్టేట్ ఏజెన్సీలను, యజమానులను సంప్రదించవలసినదిగా మనవి.