వికారాబాద్ జిల్లా బషీర్బాద్ మండలం దమార్చెడ్. ఇదే గ్రామానికి చెందిన బోయ కార్తిక్ పెద్దేముల్ మండలంలో వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే గతంలోనే ఇతనికి ఓ యువతితో పెళ్లి జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కాగా భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా వీరి కాపురం సంతోషంగానే సాగింది. కానీ పెళ్లై చాలా ఏళ్లు గడుస్తున్నా.. భార్యకు మాత్రం పిల్లలు పుట్టలేదు. దీంతో పిల్లలు కలగడం లేదని భార్యాభర్తలిద్దరూ కుమిలిపోయేవారు.
అయితే ఈ క్రమంలోనే కార్తిక్ తాండూరుకు చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. రాను రాను వీరి పరిచయం బలపడడంతో పెళ్లి చేసుకుంటానని కార్తిక్ ఆ యువతిని నమ్మించాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఆమెపై అనేక సార్లు శారీరక కోరికలు కూడా తీర్చుకున్నాడు. దీంతో కార్తిక్ ను నమ్మిన ఆ యువతి అతనితో బెడ్ షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే కార్తిక్ భార్యకు సంతానం కలిగింది. దీంతో నమ్మించి అత్యాచారం చేసిన యువతికి ఇక పెళ్లి చేసుకునే అవకాశం లేదని, పెళ్లి అని నోరెత్తితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.
ఇది కూడా చదవండి: konaseema District: కోనసీమలో గుడిసెలో తల్లీకూతుళ్ల సజీవ దహనం… వెలుగులోకి సంచలన నిజాలు!
నమ్మిన ప్రియుడే అలా అనడంతో ప్రియురాలు ఒక్కసారిగా షాక్ కు గురైంది. పుట్టెడు శోకాన్ని దిగమింగుకోలేక వెక్కెక్కి ఏడ్చింది. తట్టుకోలేని ఆ యువతికి ఏం చేయాలో తెలియక తమ కుటుంబ సభ్యులకు వీఆర్ఓ చేసిన దారుణాన్ని వివరించింది. దీంతో వెంటనే స్పందించిన తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తిక్ తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.