కొంత వరకు చదువుకున్న ఈ యువతి.. కొన్ని రోజుల నుంచి స్థానికంగా ఉండే ఓ ఇనిస్టిట్యూట్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్తుండేది. ఎప్పటిలాగే గురువారం కూడా వెళ్లిన ఆ యువతి తిరిగి ఇంటికి రాలేదు.
పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు సారిక, వయసు 18 ఏళ్లు. కొంత వరకు చదువుకున్న ఈ యువతి కొన్ని రోజుల పాటు ఇంటి వద్దే ఉండేది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి సారిక స్థానికంగా ఉండే ఓ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్లింది. ఎప్పటిలాగే గురువారం కూడా వెళ్లిన ఆ యువతి.. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఖంగారుపడ్డ ఆ యువతి తల్లిదండ్రులు అంతటా వెతికారు. ఇక చేసేదేం లేక ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా?
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని రాంనగర్ ప్రాంతం. ఇక్కడే కాట్రావత్ సారిక (18) అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. అయితే ఈ యువతి గత కొన్ని రోజుల నుంచి స్థానికంగా ఉండే ఓ ఇనిస్టిట్యూట్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్లేది. అలా కొన్ని రోజులు ఆ యువతి సెంటర్ వెళ్తూ వస్తుండేది. అయితే సారిక ఎప్పటి లాగే గురువారం కూడా ఇనిస్టిట్యూట్ కు వెళ్లింది. కానీ, సాయంత్రం అయినా కూతురు ఇంటికి రాలేదు.
దీంతో ఖంగారుపడ్డ ఆ యువతి తల్లిదండ్రులు అంతటా వెతికారు. ఎంత వెతికినా కూతురు జాడ మాత్రం కనిపించలేదు. వెంటనే కంప్యూటర్ సెంటర్ నిర్వాహకుడికి ఫోన్ చేసి అడగగా.. గత రెండు రోజుల నుంచి సెంటర్ కు రావడం లేదని తెలిపాడు. ఇక చేసేదేం లేక ఆ యువతి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఉన్నట్టుండి కూతురు కనిపించకుండపోవడంతో సారిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.