నేటి కాలంలోని యువత చెడు వ్యసనాలకు బానిసై చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారు. తెలిసి తెలియని వయసులో మద్యానికి అలవాటు పడుతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా ఇంట్లోని తల్లిదండ్రుల మాట వినకుండా వారికే ఎదురు చెబుతూ జులాయిగా మారిపోతున్నారు. ఇలా మద్యానికి అలవాటు పడ్డ ఓ కుమారుడు మద్యం మత్తులో ఏకంగా కన్నతండ్రినే కొట్టిచంపిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని ఏవీఎస్ రోడ్డులో విజయ్ అనే యవకుడు తండ్రి జాన్ తో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే విజయ్ మద్యానికి అలవాటు పడి ఇంటికి రోజు తాగి వచ్చేవాడు. అయితే రోజులాగే మద్యం సేవించిన విజయ్ ఇంటిికి వచ్చి తండ్రితో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.
ఇది కూడా చదవండి: Goa: ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని గోవాకు తీసుకెళ్లాడు! ఇక్కడ ఏం జరిగిందో తెలుసా?
ఇక వీరిద్దరి వాగ్వివివాదంలో గొడవ తీవ్ర రూపం దాల్చింది. దీంతో కోపంతో ఊగిపోయిన విజయ్ ఏకంగా దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న ఇనుపురాడ్డు తీసుకుని తండ్రి తలపై బలంగా బాదాడు. కుమారుడి దాడిలో తండ్రి జాన్ రక్తపుమడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఇక హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపడుతున్నారు. విజయవాడలో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇలా మద్యానికి అలవాటు పడ్డ కుమారులు మద్యం ఎంతకైన తెగిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.