అతని పేరు జావేద్. వయసు 30 ఏళ్లు. ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని సార్ నాథ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ యువకుడు గత కొంత కాలంగా వరుస దొంగతనాలు చేస్తూ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే అతడు మరోసారి దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చింది. ఇక ఆలస్యం చేయని జావేద్.. డానియాల్ పూర్ లో ఉన్న ఓ మగ్గం సెంటర్ లోకి వెళ్లాడు. ఎవరూ లేని టైమ్ లో అక్కడికి చేరుకున్నారు. దీంతో చాకచక్యంగా అందులోకి వెళ్లి అన్ని వస్తువులు దొంగిలించాలని తనలో తాను సంతోషపడ్డాడు.
ఇక అతడు అక్కడికి చేరుకోగానే ఆ మగ్గం సెంటర్ డోర్ పెట్టి తాళం వేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సెంటర్ లో పని లేకపోవడంతో దీనిని పూర్తిగా మూసివేశారు. జావేద్ మాత్రం ఎలాగైన లోపలికి వెళ్లాలని డోర్ ను గట్టిగా లోపలికి నెట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలోనే ఊహించని ప్రమాదంలో జావేద్ అందులోనే ఇరుక్కుని పోయాడు. ఈ సమయంలోనే జావేద్ బయటకు వెళ్లేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ అందులో నుంచి జావేద్ బయటకు రాలేకపోయాడు.
అలా చాలా సమయం జావేద్ అందులో ఉండడంతో ఊపిరాడకపోవడంతో జావేద్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీనిని చూసిన కొందరు స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. స్థానికుల ఫిర్యాదును అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అంత పరిశీలించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు జావేద్ గతంలో అనేక దొంగతనాలకు పాల్పడేవాడని, దీంతో అతడు నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.