ఇలాంటి పని మనిషి మీ ఇంట్లో గనుక ఉంటే మీ ఇల్లంతా సర్వ నాశనం అవ్వడం గ్యారంటీ. అవును.. మీరు విన్నది నిజం. ఆమె చేసిన పనేంటో తెలిస్తే మీరూ నమ్మలేరు. ఇంతకి ఆ పని మనిషి చేసింది ఏంటంటే?
మాములుగా ఉద్యోగంలో బిజీగా ఉండే కొందరు ఉద్యోగులకు ఇంటి పని చేయడం అస్సలు వీలు కాదు. దీంతో వాళ్లు ఇంట్లో పనులు చేయడానికి ఓ పని మనిషిని పెట్టుకుంటారు. ఇంట్లో పనులన్నీ చేస్తూ సమయానికి వారికి వండి పెడుతూ ఉంటారు. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి ఓ మహిళను పని మనిషిగా మాట్లాడుకున్నారు. ఆ మహిళ కొన్నాళ్ల పాటు నమ్మకంగా పని చేస్తూ మంచి పేరును సంపాదించుకుంది. కానీ, ఇటీవల ఆమె చేసిన పని ఏంటో తెలుసుకుని ఆ ఇంటి ఓనర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఇంతకి ఆమె చేసిన పనేంటి అనేదా కదా మీ ప్రశ్న.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని అజ్ నారా హోమ్ సొసైటీలో అలోక్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే, అతనికి ఇంటి పనులు చేయడం వీలు కాకపోవడంతో గతంలో ఓ మహిళను పని మనిషిగా పెట్టుకున్నాడు. కొన్ని రోజులుగా ఆమె బాగానే పని చేస్తూ వచ్చింది. కానీ, ఇటీవల ఇంట్లో దుర్వాసన రావడంతో ఆ ఇంటి ఓనర్ కు ఆ పని మనిషిపై అనుమానం కలిగింది. దీంతో ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె చేసిన దారుణం బయటపడింది. దీంతో అలోక్ సీసీ కెమెరాల ఆధారంగా ఆ పని మనిషిని పోలీసులకు అప్పగించాడు. ఇంతకి ఆమె చేసిన పనేంటంటే? ఆ పని మనిషి మూత్రంతో అతని ఇల్లంతా శుభ్రం చేసింది. ఈ దృశ్యాలన్నీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా తన నేరాన్ని అంగీకరించింది. ఇక ఆ వీడియో కూడా కాస్త వైరల్ గా మారింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ग्रेटर नोएडा स्थित अजनारा होम्स (Ajnara Homes) सोसायटी में काम करने वाली एक मेड को पानी में पेशाब ( Maid Arrested For Urinating) करके पोंछा लगाने के आरोप में अरेस्ट कर लिया गया है। सोसायटी में काम करने वाली मेड सबीना खातून की करतूत फ्लैट में लगे सीसीटीवी कैमरे में कैद हो गई थी pic.twitter.com/MzWPgYtsb5
— NEETU SHAMMI (@iamneetushammi) May 25, 2023