ఉత్తర్ ప్రదేశ్ లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగు చూసింది. ఓ కుమారుడు కత్తెరతో కన్న తల్లిదండ్రులను అతి కిరాతకంగా హత్య చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?
దేశంలో రోజు రోజుకు ఊహించని దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డుపై అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు.. కొందరు కుర్రాళ్లు కామంతో రెచ్చిపోతున్నారు. ప్రేమించాలని వెంటపడడం.., కాదంటే అత్యాచారాలు, హత్యలతో నెత్తుటేరులు పారిస్తున్నారు. ఇలా ఒకటేంటి దంపతుల మధ్య గొడవలు, వివాహేతర సంబంధాలు.. రక రకాల కారణాలతో క్షణికావేశంలో హత్యలకు కత్తులు నూరుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా.. ఓ యువకుడు ఏకంగా కనిపెంచిన తల్లిదండ్రులను అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా హత్య చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. అది ఉత్తర్ ప్రదేశ్ అలీగఢ్ పరిధిలోని మొహల్లా జకీర్ నగర్ ప్రాంతం. ఇక్కడే ఇషాక్(60)-షెహజాదీ బేగం (57) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. వీరికి ఐదుగురు సంతానం. అయితే పెద్ద కుమారుడైన గులాముద్దీన్ (24) స్థానికంగా ఉండే ఓ కాలేజీలో బీకాం చదువుతున్నాడు. ఇకపోతే.. గత కొన్ని రోజుల నుంచి ఈ యువకుడి మతిస్థిమితం సరిగ్గా లేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే గులాముద్దీన్ తరుచు వృద్ద తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడు. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి సమయంలో గులాముద్దీన్ తన సోదరులను బయటకు నెట్టి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేశాడు.
వెంటనే నిద్రిస్తున్న తల్లిదండ్రులపై కత్తెరతో దాడి చేశాడు. వారు అరుపులు వేయడంతో స్థానికులు వచ్చి తలుపులు తీసే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఆ వృద్ద దంపతులు అప్పటికే రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. కన్న తల్లిదండ్రులను అతి కిరాతకంగా హత్య చేసిన కుమారుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.