పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ మహిళ కట్టుకున్న భర్తను తమ్ముడితో చేతులు కలిపి దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన సొంత తమ్ముడితో చేతులు కలిపి కట్టుకున్న భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇంతకు ఆ మహిళ తన తమ్ముడితో కలిసి భర్తను ఎందుకు చంపాలని అనుకుంది. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలేం జరిగిదంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ గోవిందపురం పరిధిలోని ఓ ప్రాంతంలో షకీల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ భార్యాభర్తలు సంతోషంగానే జీవించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండేనంతంగా మారిపోయారు. కానీ, వీళ్లు అలా ఎక్కువ రోజులు కలిసి సంతోషంగా ఉండలేకపోయారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత భర్త షకీల్ భార్యను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినట్లుగా తెలుస్తుంది. ఇక భర్త టార్చర్ ను ఆ మహిళ భరించలేకపోయింది. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియక మొగుడి హత్యకు ప్లాన్ గీసింది.
ఇందులో భాగంగానే ఆమె తన సొంత తమ్ముడి సాయం కోరింది. అతడు అక్క కోసం కాదనలేక సరేన్నాడు. ఇక పక్కా ప్లాన్ తోనే ఆ మహిళ ఇటీవల భర్తను తన పుట్టింటికి రప్పించింది. అతడు రాగానే తన తమ్ముడితో కలిసి మద్యం తాగించింది. భర్త మద్యం మత్తులో జారుకున్నాక ఇద్దరూ కలిసి షకీల్ ను దారుణంగా హత్య చేశారు. అనంతరం భర్త మృతదేహాన్ని ఫతేపూర్ లోని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం తెలియదన్నట్లుగా.. నా భర్త కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు షకీల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మొత్తానికి షకీల్ మృతదేహం ఫతేపూర్ లో స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇంతకి షకీల్ ను ఎవరు హత్య చేశారనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. అయితే, దర్యాప్తులో భాగంగా ముందుగా మృతుడి భార్యను విచారించారు. మొదట్లో నాకేం సంబంధం లేదన్నట్లుగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఇక్కడే పోలీసులకు ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఇక పోలీసుల స్టైల్ లో విచారించేసరికి ఆ మహిళ నేరాన్ని అంగీకరించింది. గత కొన్ని రోజుల నుంచి నా భర్త గృహ హింస పెట్టాడని, దీని కారణంగానే నా భర్తను సోదరుడితో కలిసి హత్య చేశానని ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను, అతని సోదరుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. భర్త టార్చర్ పెడుతున్నాడని తమ్ముడితో కలిసి భర్తను చంపిన భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.