డబ్బు.. మనిషిని ఎంతవరకైనా దిగజారుస్తుంది, ఎక్కడికైన తీసుకెళ్తుంది. అలా డబ్బుకు, మద్యానికి అలవాటు పడ్డ ఓ భర్త తన భార్యను స్నేహితుల పక్కలోకి పంపుతున్నాడు. పరాయి వాడి పక్కలోకి పంపుతూ, పైగా వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ గా దిగాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు నెలల పాటు కట్టుకున్న భార్యకు భర్త బతికుండగానే నరకం చూపించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ ప్రాంతంలోని బన్స్ గావ్ గ్రామానికి చెందిన ఓ యువతికి 8 నెలల కిందట అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. యువతి పేద కుటుంబంలో జన్మించడంతో పెళ్లి సమయంలో అడిగినంత కట్నం ఇవ్వలేదు. అయితే పెళ్లి సమయంలో యువకుడు ఓ చోట ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ఆ తర్వాత జులాయిగా తిరగడం మొదలు పెట్టాడు. తాగుడు బానిసై అదే పనిగా తిరుగుతున్నాడు. ఇక డబ్బులు లేకపోవడంతో భార్యను అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేసేవాడు.
ఇది కూడా చదవండి: Bihar: హేయ్.. నేను దుర్గామాతను, పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ.. వీడియో వైరల్!
ఇంతటితో ఆగకుండా తన స్నేహితులను మద్యం తాగడానికి ఇంట్లోకి పిలిచేవాడు. తాగిన తర్వాత వాళ్ల పక్కలో పడుకోమంటూ భార్యను ఒత్తిడికి గురి చేసేవాడు. పైగా తన స్నేహితులతో అతని భార్యపై అత్యాచారం చేయిస్తూ వీడియోలు తీసేవాడు. స్నేహితుల వద్దకు వెళ్లకపోతే నీ వీడియోలు బయటపెడతానంటూ వేధించేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు నెలల పాటు భార్యపై భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఇక భర్త కిరాతకాన్ని భరించలేకపోయిన భార్య ఇటీవల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త, అతడి స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.