ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. యువతిపై కన్నేసిన ఓ జిమ్ ట్రైనర్ గత కొంత కాలం నుంచి మాయ మాటలతో తన వైపు తప్పుకోవాలని చూశాడు. కానీ ఆ యువతి అతగాడి వేధింపులకు తలొగ్గకుండా వార్నింగ్ ఇస్తూ ముందుకు వెళ్లింది. దీంతోనే యువతిపై పగ పెంచుకున్న జిమ్ ట్రైనర్ అందరూ చూస్తుండగా కారులో బలవంతగా ఎక్కించుకుని కనిపించకుండా పోయాడు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోండాలోని నవాజ్ గంజ్ ప్రాంతం. స్థానికంగా ఓ యువకుడు జిమ్ సెంటర్ ను నడిపిస్తున్నాడు. కాగా ఈ జిమ్ సెంటర్ కి ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్న 22 ఏళ్ల యువతి వెళ్తుండేది. అయితే అప్పటి నుంచి ఆ జిమ్ ట్రైనర్ ఆ యువతిపై కన్నేశాడు. వర్కౌట్స్ నేర్పిస్తూనే ఆమెపై కోరికలు పెంచుకున్నాడు. ఇందులో భాగంగానే ఆ యువతికి మాయమాటలు చెప్పి తన ముగ్గులోకి దింపి తన వైపు తప్పుకోవాలనుకున్నాడు.
ఇది కూడా చదవండి: జన్మ జన్మల అనుబంధం.. చావు కూడ విడదీయలేకపోయింది!
కానీ అతగాడి వేధింపులకు లెక్కచేయని ఆ యువతి అవాయిడ్ చేసుకుంటూ వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఆ జిమ్ ట్రైనర్ యువతిపై పగతో రగిలిపోయి కసితీరా కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఆ యువతి మార్కెట్ కు వెళ్లగా ఆమెను ఫోలో అయ్యాడు. రోడ్డుపై వెళ్తూ అందరూ చూస్తుండగా తన కారులో యువతని బలవంతంగా ఎక్కించుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు ఆపే ప్రయత్నం చేసినా తప్పించుకుని కారుతో పరారయ్యాడు.
వెంటనే స్థానికులు ఆ యువతి కుటుంభికులకు సమాచారాన్ని అందించారు. అలెర్ట్ అయిన యువతి కుటుంభికులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.