పైన ఫొటోలో ఏం తెలియనట్టు అమాయకంగా కనిపిస్తున్న మహిళ పేరు ఆర్తి. గతంలో ఓ వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు తాళికట్టిన భర్తతో బాగానే సంసారం చేసింది. అలా రోజులు గడుస్తున్న కొద్ది మహిళ భర్తను కాదని పక్క చూపులు చూసింది. ఈ క్రమంలోనే ఈ మహిళకు ఫేస్ బుక్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. కొంత కాలం పాటు ఆర్తి ప్రియుడితో ఛాటింగ్ చేసింది. చివరికి ఆమెకు భర్త కంటే ఫేస్ బుక్ ప్రియుడే ప్రాణం అనుకుంది. ఇందులో భాగంగానే ప్రియుడితో ఉండేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని ఆర్తి భర్తను దారుణంగా చంపింది. సినిమా స్టైల్ లో ఉన్న ఈ క్రైమ్ స్టోరీ ఎక్కడ జరిగిందనేదే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఉత్తర్ ప్రదేశ్ బరేలీ పరిధిలో కంధర పూర్ గ్రామం. ఇక్కడే రోహిత్ కుమార్ (27), ఆర్తి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా కాపురాన్ని ఈడ్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆర్తి భర్తతో ఉన్న సుఖం చాలదన్నట్లుగా ఫేస్ బుక్ లో అనూజ్ పటేల్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. వీరి పరిచయం రాను రాను వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. ఇక ఇంకేముంది.. ఆర్తి తాళికట్టిన భర్త కన్న ప్రియుడితో ఉండేందుకు ఇష్టపడింది. రాను రాను ఈ అందాల సుందరికి భర్త కన్న ప్రియుడే ఎక్కువయ్యాడు. ఈ క్రమంలోనే ఈ మహిళకు ఓ దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. అదే భర్తను చంపడం. ఆర్తి ఇదే విషయాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే తన ప్రియుడికి వివరించింది.
ప్రియురాలి మాటలు విన్న ప్రియుడు అనూజ్ పటేల్ ఎగిరిగంతేసినంత పని చేశాడు. ఇక ఇద్దరూ అనుకున్నట్లుగానే రోహిత్ కుమార్ హత్యకు ప్లాన్ గీశారు. పక్కా ప్లాన్ తో అడుగులు వేసిన ఆర్తి అనూజ్ పటేల్ స్నేహితులతో కలిసి శుక్రవారం రోహిత్ కుమార్ ను దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న రోహిత్ కుమార్ కుటుంబ సభ్యులు ఆర్తిని నిలదీశారు. ఈ విషయంలో తనకేం సంబంధం లేదన్నట్లుగా ఆర్తి నటించే ప్రయత్నం చేసింది. కానీ ఎందుకో ఆర్తి మీద రోహిత్ కుమార్ కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్తిని ప్రశ్నించారు. మొదట్లో పొంతనలేని సమాధానాలు చెప్పిన ఆర్తి.. ఆ తర్వాత అసలు నిజాలు వెళ్లగక్కింది. నేరం రుజువు కావడంతో పోలీసులు ఆర్తితో పాటు ఆమె ప్రియుడు అనూజ్ పటేల్, అతని స్నేహితులను అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.