ఈ రోజుల్లో చాలా మంది మహిళలు తాళికట్టిన భర్తకు బాయ్ చెప్పి ప్రియుడికి హాయ్ చెబుతున్నారు. చివరికి కట్టుకున్న భర్తను కాదని ప్రియుడితో సరసాలకు దిగుతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా ప్రియుడితో ఉండేందుకు అడ్డొచ్చిన భర్తను కూడా ప్రాణాలతో లేకుండా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొకటి జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఈ ఘటనలోనే ఓ వ్యక్తి తన భార్య ప్రియుడిని దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో రిక్లా పుల్లర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. కొంత కాలం తర్వాత ఆమె మరణించింది. దీంతో పుల్లర్.. పూనమ్ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలానికి వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. ఇక రిక్లా పుల్లార్ స్థానికంగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాడు. అలా సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలో భార్య తన వక్రబుద్దిని చూపించింది. విషయం ఏంటంటే? పూనమ్ స్థానికంగా ఉండే ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.
భర్తకు తెలియకుండా ఆ మహిళ ప్రియుడితో కొంత కాలం పాటు ఈ చీకటి కాపురాన్ని నడిపిస్తూ వచ్చింది. అయితే భార్య సాగిస్తున్న ప్రేమాయణం ఇటీవల భర్తకు తెలిసింది. కోపంతో ఊగిపోయిన భర్త భార్యను మందలించాడు. అయినా భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఎలాగో భర్తకు తెలిసింది, ఇంకెముందని అతని భార్య మరింత రెచ్చిపోయి ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే పుల్లర్ తన భార్య ప్రియుడికి ప్రియుడి ఫోన్ చేశాడు. నీ సాయం కావాలని, అర్జెంట్ గా ఓ చోటుకు రావాలంటూ కబురు పంపాడు.
ఎలాంటి అనుమానం లేకుండా భార్య ప్రియుడు అతడు చెప్పిన చోటుకు వెళ్లాడు. అతడు రాగానే పుల్లర్ అతడితో మాటలు కలిపి తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో అతడిని దారుణంగా నరికి చంపాడు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి విసిరేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు రిక్లా పుల్లర్ ను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.