ఈ రోజుల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. రోడ్డుపై అందమైన ఆడది కనిపిస్తే చాలు.. ఐ లవ్ యూ చెప్పడం, కాదంటే అత్యాచారం, ఆపై హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతూనే ఉన్నాయి. రోడ్డుపై మహిళలకే కాదు.. ఇంట్లో ఉన్న మహిళలకు కూడా రక్షణ కరువవుతుంది. కొంతమంది తండ్రులు మాత్రం.. ఏకంగా కన్న కూతుళ్లను కూడా అత్యాచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ యువకుడు తన తల్లిని బలవంతంగా అత్యాచారం చేశాడు. కొడుకు దారుణాన్ని సహించలేకపోయిన తల్లి.. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఉత్తర్ ప్రదేశ్ బండాలో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. అయితే మొదటి భార్య ఓ కుమారుడు, రెండవ భార్యకు ఓ కూతురు ఉంది. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి మొదటి భార్య కుమారుడు తన సవతి తల్లిపై కన్నేశాడు. ఎలాగైన అత్యాచారం చేయాలని అనుకున్నాడు. అయితే ఇందులో భాగంగానే ఆదివారం ఆ కుమారుడు అతిగా మద్యం సేవించి ఇంటికెళ్లాడు. ఆ సమయంలో సవతి తల్లి ఒంటరిగా కనిపించింది. ఇదే మంచి సమయం అనుకున్న ఆ కుమారుడు తల్లిని బలవంతంగా అత్యాచారం చేశాడు.
ఆ సమయంలో తల్లి వద్దని ఎంతో ప్రాధేయపడింది. అయినా వదలని కుమారుడు.. మద్యం మత్తులో తల్లిని అత్యాచారం చేశాడు. ఇక కుమారుడి దారుణాన్ని సహించలేని ఆ తల్లి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సవతి తల్లిపై అత్యాచారం చేసిన ఈ కొడుకుకి మీరైతే ఎలాంటి శిక్ష విధిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.