ఓ యువతి ఓ యువకుడిని ప్రేమిస్తుంది. ఆ యువకుడు కూడా ఆ యువతిని ఇష్టపడ్డాడు. దీంతో ఇద్దరు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల ఆ యువతి తన ప్రియుడితో ఏకాంతంగా ఉండగా ఆమె తండ్రి చూశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రేమకు కులం, మతం, ప్రాంతం ఇవేవి అడ్డు కాదు. కానీ, ఈ మధ్యకాలంలో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు మాత్రం.. వావి వరసలు మరిచి ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఎదురించి మరీ వివాహం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తునే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓ యువతి తన ప్రియుడితో ఇంట్లో ఏకాంతంగా ఉండగా.. ఆ యువతి తండ్రి చూశాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవండి.
అది ఉత్తర్ ప్రదేశ్ మీరట్ పరిధిలోని పెప్లా ప్రాంతం. ఇక్కడే సాక్షి, దేవేంద్ర అనే అన్నాచెల్లెళ్లు నివాసం ఉంటున్నారు. ఇద్దరు తరుచు మాట్లాడుకునేవారు. కానీ, రాను రాను వీరి ఆలోచనలు మారి.. చివరికి ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. అలా వీరి ప్రేమాయణం చాలా రోజులే కొనసాగింది. ఇక రోజూ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకోవడం, బయటకు సినిమాలు, షికారులు అంటూ తిరిగేవారని సమాచారం. దీంతో వీళ్లిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు.
ఇదిలా ఉంటే… ఇటీవల సాక్షి ఇటీవల ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో తన ప్రియుడికి ఫోన్ చేసింది. ఇంట్లో ఎవరూ లేరని, అర్జెంట్ గా వచ్చేయ్ అని చెప్పింది. ప్రియురాలి మాటను కాదనని ప్రియుడు.. ఎగేసుకుని పరుగు పరుగున ప్రియురాలి బెడ్ రూంలో వాలిపోయాడు. ఇక ఇంకేముంది… ఇద్దరూ ఎంచక్కా ఏకాంతంగా కలిసి ఎంజాయ్ చేశారు. ఇక ఇదే సమయంలో సాక్షి తండ్రి సడెన్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వస్తూ వస్తూనే బెడ్ రూంలోకి వెళ్లాడు. కూతురు ఆమె ప్రియుడితో ఏకాంతంగా కలిసి ఉండడం చూసిన ఆ యువతి తండ్రి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు.
ఇది కలనా, నిజమా అనేది తొందరగా తెలుసుకోలేకపోయాడు. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆ యువతి తండ్రి… ఇంట్లో ఉన్న తుపాకీతో ఇద్దరినీ కాల్చాడు. దేవేంద్ర అక్కడికక్కడే చనిపోగా, సాక్షి మాత్రం కొన ప్రాణాలతో కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు వెంటనే సాక్షిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ యువతి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. కూతురుని, ఆమె ప్రియుడిని కాల్చి చంపిన ఈ తండ్రి దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.