ఏకాంతంగా కలిసున్న ఉన్న ఓ ప్రేమ జంటపై కొందరు అల్లరి మూకలు దారుణానికి పాల్పడ్డారు. వారిని మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేయడమే కాకుండా వివస్త్రను చేసి వీడియోలు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. ఇదే విడియో చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని హమీర్ పూర్ లో ఓ ప్రేమ జంట ఇటీవల ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఏకాంతంగా కలిసున్నారు. దీనిని గమనించిన కొందరు స్థానిక యువకులు వారి వద్దకు వెళ్లడమే కాకుండా దారుణానికి ఒడిగట్టారు. వారిని శారీరకంగా, మానసికంగా హింసించడంతో పాటు వివస్త్రను చేశారు. ఇక ఇంతటితో ఆగకుండా విచక్షణ రహితంగా దాడికి పాల్పడుతూ వీడియోలు తీశారు. మమ్మల్ని వదిలిపెట్టమని ఎంత వేడుకున్నా కూడా.., ఆ అల్లరిమూక ఎంతకు కనికరించలేదు. అనంతరం ఆ పోకిరీల కేటుగాళ్లు వారి వద్దనున్న నగలు, డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా నిందితులందరూ సమీప గ్రామాల్లోని యువకులే అని గుర్తించారు. పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏకాంతంగా కలిసుకున్న ప్రేమికులపై ఇంతటి దారుణానికి పాల్పడ్డ పోకిరీ ఎదవలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Hamirpur, UP | A video showing a man & woman in inappropriate condition was received. It was found that some people had beaten them up & demanded money. So far, inquiry established that they were molested & left naked. No incident of gang rape: Ravi Prakash, CO (18.08) pic.twitter.com/8qwY2Wf0BR
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 19, 2022