సమాజంలో చాలా ఘోరాలు, దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రం ఎంతో దారుణంగా, హేయంగా ఉంటాయి. అసలు వీడు మనిషేనా అని ఛీదరించుకునేలా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది అలాటి ఒక ఘటన గురించే. ఓ యువకుడిని ఓ గ్యాంగ్ చికబాదింది. ఆ తర్వాత గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి బాధితుడి ముఖంపై మూత్రవిసర్జన కూడా చేశాడు. అక్కడితో ఆగకుండా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అది కాస్తా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వాళ్లు అతడి పరువు తీసేందుకు వీడియో పోస్ట్ చేస్తే.. చివరకి అదే వాళ్లని అరెస్టు అయ్యేలా చేసింది.
ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గోండా జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం. ఆ ప్రాంతంలో రెండు గ్యాగ్ లు ఉన్నాయి. వాటిలో ఒక గ్యాంగ్ కి నాయకుడు నిందితుడు కప్తాన్ సింగ్, మరో గ్యాంగ్ నాయకుడు బాధితుడు శివ సింగ్ అని తేలింది. వీళ్ల మధ్య ఎప్పుడూ ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. అయితే రెండు వారాల క్రితం వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ గొడవలో శివ గ్యాగ్ వాళ్లు ఓడిపోయారు. ఇంక ఆ గ్యాంగ్ లీడర్ శివ సింగ్ ను పట్టుకుని దాడి చేశారు. అతనిపై కప్తాన్ సింగ్ మూత్ర విసర్జన చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కాగా పోలీసుల దృష్టికి వెళ్లింది.
పోలీసులు వెంటనే బాధితుడి ఇంటికి వెళ్లి వారి వద్ద ఫిర్యాదు తీసుకున్నారు. వెంటనే కప్తాన్ సింగ్ ని అరెస్టు చేశారు. అయితే ఓ హత్యకు సంబంధించి నేరాన్ని అంగీకరించాలని శివ సింగ్ పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీళ్ల ఇద్దరిపై గతంలోనే చాలా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కప్తాన్ సింగ్ అయితే ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి దాడులు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే సహించేది లేదంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.