దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు. తల్లి ప్రేమ ఎప్పటికీ మారదు. తన బిడ్డకు ఏ చిన్న ప్రమాదం జరిగినా.. తన కంటి నుంచి నీరు వస్తుంది. అంతలా విల విలలాడుతుంది తల్లి. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కానీ ఓ తల్లి మాత్రం పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించింది.. టీ లో విషయం కలిపి మరీ చంపేసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్‌ప్రదేశ్ ఘాజీపూర్‌లో నివసిస్తున్న సునీత యాదవ్‌కు కొంత కాలంగా అత్తామామ, భర్తతో గొడవలు జరుగుతున్నాయి. ప్రతి చిన్న విషయంలో సునీత యాదవ్ పై అత్తమాలు గొడవపడటం.. దానికి తోడు ఆమె భర్త కూడా తల్లిదండ్రులకు సపోర్ట్ చేయడంతో సునిత విసుగెత్తిపోయింది. ఈ క్రమంలోనే సునీత యాదవ్ తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చింది. అయినప్పటికి భర్త వదల లేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది.. విచక్షణ కోల్పోయి తన ముగ్గురు సంతానికి టీ లో విషపదార్థం కలిపి ఇచ్చింది.
తమ తల్లి ఇచ్చిన విషం కలిపిన టీ తాగడంతో ముగ్గురు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. విషం కలిపిన టీ తాగడం వల్లనే హిమాన్షు యాదవ్ (10), పియూశ్ యాదవ్ (8), సుప్రియ(5) లు ఎస్పీ రోహన్ ప్రసాద్ తెలిపారు. ఆ సమయంలో చిన్న కొడుకు లేక పోవడంతో బతికిపోయాడు. విషం కలిపిన ఆ టీని ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.