Crime News: బిహార్‌లోని నవాడా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకేసారి ముగ్గురు అమ్మాయిలు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నవాడా జిల్లా మహులి గ్రామానికి చెందిన రాణీ దేవీ(18), కాంచన కుమారి(14), ఆశా కుమారి(13) మంచి స్నేహితులు. ముగ్గురు కలిసి తిరిగే వారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ముగ్గురూ నక్తి బ్రిడ్జికి దగ్గరలోని ఓ షాపు కుట్టు మిషన్ నేర్చుకుంటున్నారు. వీళ్లు ప్రతీ రోజు కలిసి షాపునకు పోయి, సాయంత్రం కలిసి ఊరికి వచ్చేవాళ్లు. రోజులాగే ఆగస్టు 13వ తేదీ కుట్టు మిషిన్ నేర్చుకోవటానికి వెళ్లారు. సాయంత్రం ఊరికి తిరిగి వచ్చారు. ఏమైందో ఏమో తెలియదు కానీ, ముగ్గురు విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆపస్మారక స్థితిలో ఉన్న వారిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాణి దేవీ, ఆశా కుమారి అదే రాత్రి కన్నుమూశారు. కాంచన్ కుమారి బుధవారం మృత్యువాతపడింది. అయితే, ఆగస్టు 13న ఏం జరిగింది? ఇంటికి వచ్చిన వెంటనే వాళ్లు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అన్న విషయాలు మిస్టరీగా మారాయి. ముగ్గురి ఆత్మహత్యతో గ్రామంలో అలజడి చెలరేగింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : వీడియో: బరితెగించిన దొంగలు! నడిరోడ్డుపై మహిళ బ్యాగ్ ను ఎత్తుకెళ్ళి..