మనుషుల్లో రోజు రోజుకు హింసా ప్రవృత్తి పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలకే దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమ, అక్రమ సంబంధాలు వంటి విషయాల్లో నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమించలేదని.. లేదంటే పెళ్లికి నిరాకరించిందని.. ఇలా ఏదో ఓ కారణంతో ప్రాణాలు తీస్తున్న ప్రేమోన్మాదులను నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడు. దాంతో సదరు మహిళ అతడి గొంతు కోసి హత్య చేసింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఘజియాబాద్‌కు చెందిన ఓ వివాహిత మహిళ.. నాలుగేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆమెకు ఫిరోజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ప్రేమగా మారడంతో.. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఫిరోజ్‌ను కోరగా అందుకు అతను నిరాకరించాడు. ఎన్ని సార్లు ఎన్ని విధాల అడిగినా సరే.. అతడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. ఫిరోజ్ పెళ్లికి ఒప్పుకోక పోవడంతో కక్ష పెంచుకుని పక్కా ప్లాన్ ప్రకారం అతడ్ని హతమార్చింది నిందితురాలు.
రేజర్‌తో గొంతు కోసి..
ఫిరోజ్‌ని హత్య చేయాలని భావించిన నిందితురాలు.. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకంది. దానిలో భాగంగా ప్రియుడిని ఇంటికి పిలిచింది. మాటలో మధ్యలో.. ఉన్నట్లుండి సడెన్‌గా రేజర్‌తో ఫిరోజ్ గొంతు కోసి చంపింది నిందితురాలు. ఆ తర్వాత మృతదేహాన్ని పడేసేందుకు పెద్ద సూట్‌కేసు కొనుగోలు చేసింది. సూట్‌కేసులో మృతదేహాన్ని పెట్టి కారులో తరలిస్తుండగా పోలీసులకు చిక్కింది. అనుమానం వచ్చిన పోలీసులు.. ఆమెను ఆపి పరిశీలించగా.. మొత్తం వ్యవహారం బటయకు వచ్చింది. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Ghaziabad: #PreetiSharma Kills #Firoz for refusing to marry her after living with her for 4 years with this promise.
Kills him, Packs his dead body in the bag but was arrested when she was on the way to dispose off the body. pic.twitter.com/Lnx2v5ZQpd— DR. AMIT MANOHAR (@dramitmanohar) August 8, 2022