గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్‌పై కాల్పులు జరిపి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు విచారణలో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతీఖ్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లపై మీడియా, పోలీసుల ఎదురుగానే.. దుండగులు కాల్పులు జరిపి హతమార్చిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి.. అతీఖ్‌ను చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. జర్నలిస్ట్‌లు ముసుగులో వచ్చిన దుండుగులు.. అదును చూసి.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో అతీఖ్‌పై కాల్పులు జరిపారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచనలనంగా మారింది. అతీఖ్ హత్యకు రెండు రోజుల ముందే.. అతడి కుమారుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అతీఖ్ హత్యకు పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితులను లవ్లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించారు పోలీసులు
పోలీసులు విచారణలో ఈ ముగ్గురు సంచలన విషయాలు వెల్లడించారు. ఫేమస్ అవ్వాలని.. ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాము.. అతీక్ అహ్మద్‌ను షూట్ చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం పిస్టళ్లతో వెళ్లి.. అదును చూసి అతీఖ్‌ను కాల్చి చంపినట్లు పోలీసులకు తెలిపారు. కాల్పుల అనంతరం ముగ్గురు యువకులు ఘటనా స్థలంలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పినదాని ప్రకారం.. ఈ ముగ్గురు యువకులు 22 సెకన్ల పాటు.. 14 రౌండ్లు కాల్పులు జరిపారు.
ఇక హత్యకు గురైనా గ్యాంగ్‌స్టర్ అతీక్‌పై 100కు పైగా క్రిమినల్ కేసులున్నాయి. 2005 నాటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకు ప్రధాన సాక్షి ఉమేశ్‌పాల్‌ను హత్య చేసిన కేసులో కూడా అతీక్, అతడి సోదరుడు, కుమారులు నిందితులుగా ఉన్నారు. ఇక ఈ కేసు విచారణ నిమిత్తం అతీక్ సోదరులను పోలీసులు ఇటీవలే అహ్మదాబాద్ సెంట్రల్ జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల నిమిత్తం శనివారం రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో పోలీసులు అతీక్ సోదరులను ఎంఎల్‌ఎన్ వైద్య కళాశాలకు తరలించారు.
ఆ సమయంలో అతీఖ్, అతడి సోదరుడు ఇద్దరి చేతులకు బేడీలతో ఉసి ఉండగా.. వారు మీడియాతో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇంతలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మీడియా ముసుగులో వారితో పాటు నడుస్తున్న ముగ్గురు నిందితులు.. ఉన్నట్టుండి తమ వద్ద ఉన్న పిస్టళ్లు బయటకు తీసి.. నేరుగా అతీఖ్, అతడి సోదరుడిపై కాల్పులకు దిగారు. నిందితుల్లో ఒకరు ముందు అతీక్ తలపై కాల్చాడు. విస్మయంతో చూస్తున్న అఫ్రష్ తలపైకి మరో తూటా దూసుకెళ్లింది.
ఈ క్రమంలో అతీఖ్, అతడి సోదరుడు ఇద్దరూ మీడియాతో మాట్లాడుతున్న వాళ్లు మాట్లాడుతున్నట్టుగానే అక్కడే కుప్పకూలిపోయారు. వారితో పాటున్న పోలీసులు కాల్పులు జరుగుతుంటే తలోవైపు చెదిరిపోయారు. ఆ వెంటనే హంతకులు ముగ్గురూ.. కుప్పకూలిన అతీక్ సోదరుల దగ్గరికి వెళ్లి వారిపై తూటాల వర్షం కురిపించారు. తేరుకున్న పోలీసులు నిందితుల వైపు దూసుకురాగా.. హంతకుల్లో ఇద్దరు చేతులు పైకెత్తి లొంగిపోయారు. మూడో వ్యక్తి కొద్ది దూరం పరిగెత్తినప్పటికి.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.