Buldhana: తప్పు చేశారు అని అనిపిస్తే చాలు జనం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఆ తప్పు చేసిన వారిని దారుణంగా శిక్షిస్తున్నారు. కొన్ని సార్లు తప్పు చేసిన వ్యక్తి ప్రాణాలను సైతం తీసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, అవతలి వ్యక్తి తప్పు చేశాడా? లేదా? అన్న విషయం తెలుసుకోకుండా జనం తలా ఓ చెయ్యి వేసి శిక్షించటం సరదాగా మారిపోయింది. తాజాగా, పిల్లల్ని కిడ్నాప్ చేయటానికి వచ్చిందని భావిస్తూ.. ఓ ట్రాన్స్‌జెండర్‌పై తమ జులుం ప్రదర్శించారు కొందరు వ్యక్తులు. నడిరోడ్డుపై కాళ్లు. చేతులతో విపరీతంగా కొట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ సంఘటన మహారాష్ట్రలో బుధవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని మల్కాపూర్‌కు చెందిన సైరా మోగ్రా జాన్ అనే ట్రాన్స్‌జెండర్ బుధవారం సాయంత్రం జాల్‌గావ్-జమోద్ బస్ స్టేషన్‌కు వెళ్లింది. తన స్నేహితురాలితో కలిసి ఆటోలో అక్కడ బిక్షాటనకు వచ్చింది. ఆటో దిగి ఆమె బస్‌స్టాండ్‌లో నిలబడి ఉంది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ ఎవరికో ఫోన్ చేశాడు. ఆ ట్రాన్స్‌జెండర్ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయటానికి వచ్చిందని చెప్పాడు. దీంతో ఓ పది మందిదాకా అక్కడికి వచ్చారు. ఆమెను ఏమీ అడగకుండా విచక్షణా రహితంగా కొట్టడం ప్రారంభించారు. ఆమె వదిలిపెట్టమని ఎంత బతిమాలుతున్నా వదిలిపెట్టలేదు.
కాళ్లు, చేతులతో విపరీతంగా కొట్టారు. కొద్దిసేపటి తర్వాత ఆమెను ఆటో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, ట్రాన్స్‌జెండర్ తప్పేమీ లేదని పోలీసులు తేల్చారు. దీంతో ట్రాన్స్‌జెండర్ తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టింది. మొత్తం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే.. మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్స్‌తో దర్నా చేస్తానని సైరా పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
साधुओं के बाद किन्नर की हुई लात-घूसों से पिटाई, हैरान कर देने वाली है वजह#Maharashtra #viral #fights #Sadhu #transgender pic.twitter.com/xnEodSGFFQ
— News Track (@newstracklive) September 15, 2022
ఇవి కూడా చదవండి : ఒప్పించి లవ్ మ్యారెజ్ చేసుకున్నారు.. పెళ్లై 15 రోజులు కాలేదు!