ఈ రోజుల్లోని యువత పెద్దలు కుదుర్చిన పెళ్లిల కంటే ప్రేమ వివాహాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాదంటే తల్లిదండ్రులను ఎదురించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే పెళ్లి చేసుకున్న ఓ జంట చివరికి ఊహించని నిర్ణయం తీసుకుని విషాదాన్ని నింపారు. తాజాగా పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది పల్నాడు జిల్లా పిడగురాళ్ల పరిధిలోని రజకకాలనీ. ఇక్కడే చంపాల నాగేశ్వరరావు, నాగమ్మ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి అఖిల(17) అనే కూతురు కూడా ఉంది. భర్త గతంలోనే కాలం చేయడంతో భార్య నాగమ్మ కూతరితో పాటు ఉంటుంది.
ఇంటర్ పూర్తి చేసిన అఖిల స్థానికంగా ఉండే వినయ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. అలా కొంత కాలం పాటు వీరిద్దరూ ప్రేమ విహారంలో తేలియాడారు. ఇక ఎలాగైన పెళ్లి చేసుకోవాలని ముందుగా పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ మొదట్లో వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. అయినా సరే పెద్దలను ఒప్పించి చివరికి ఓ గుడి వద్ద ఇరువురి కుటుంబ సభ్యుల ఇష్టం మేరకు పెళ్లి చేసుకున్నారు. పెళ్లై 15 రోజులు గడిచింది. అప్పటి వరకూ ఇద్దరు సంతోషంగా ఉన్నట్లే నటించారు.
ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., మంగళవారం అఖిల, వినయ్ ఇద్దరు నాగమ్మ ఇంట్లో ఉన్నారు. వీరిద్దరిని తినడానికి పిలిచేందుకు నాగమ్మ వారి గదిలోకి వెళ్లింది. తలుపులు తీసి చూడగా ఊహించని సీన్ కనిపించింది. అఖిల, వినయ్ ఇద్దరు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. ఒక్కసారిగా ఖంగుతిన్న నాగమ్మ అరుపులు, కేకలతో కన్నీటి పర్యంతమైంది. ఏం జరిగిందని స్థానికులు ఇంట్లోకి రాగ అంతా షాక్ గురయ్యారు. వెంటనే వారిద్దరిని కిందకు దించగా అఖిల అప్పటికే మరణించగా, వినయ్ కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరు సూసైడ్ చేసుకోబోయే ముందు వారున్న గదిలో నల్లటి గీతలతో.. పెద్ద మనుషులు న్యాయం చేయలేదు.. న్యాయం జరగాలి. ఇప్పటికైనా న్యాయం జరగాలని ఆశిస్తున్నాం అంటూ రాశారు. పెద్దలతో పంచాయితీలో మనస్థాపానికి గురై వీరు సూసైడ్ చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.