బాలీవుడ్ లో పేలిన డ్రగ్స్ బాంబ్ ప్రభావం ఇప్పుడు సౌత్ వరకూ విస్తరించింది. అక్కడ సౌండ్ వస్తే ఇక్కడ రీసౌండ్ వస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో రియా తెలిపిన పేర్లు తెలుగు ఇండస్ట్రీని కుదుపేస్తున్నాయి. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు వెలుగులోకి రావడంతో ఇంకెంత మంది పేర్లు బయటకు వస్తాయో అనే టెక్షన్ వాతావరణం ఇండస్ట్రీలో నెలకొంది. డ్రగ్స్ పెడ్లింగ్, అమ్మకం, తరలింపు ఇవి నేరాలు. డ్రగ్స్ వాడితే బానిసలు, వాళ్లు బాధితులు. ఇదే రీజన్‌తో గతంలో టాలీవుడ్‌లో డ్రగ్స్ చైన్‌పై కేసు అలా ఆగిపోయింది. వాళ్లు నేరస్తులు కాదు.. బాధితులు అని కొందరిపై వచ్చిన ఆరోపణలు ఆధారాలేవంది అప్పుడు దర్యాప్తు చేసిన సిట్. ఇదే కేసులో ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది.
అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న రవితేజ, రానా, తరుణ్, పూరి జగన్నాథ్, నవదీప్, చార్మి, రకుల్ ప్రీత్‌సింగ్, ముమైత్‌ఖాన్, నందు, శ్రీనివాస్‌కు మళ్లీ ఈడీ సమన్లు జారీ చేసింది. గతంలో నోటీసులు అందుకున్న 14 మంది తోపాటు, రాణా, రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా నోటీసులు ఇచ్చారు. మొత్తం 16 మందికి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు అందర్ని 23 రోజుల పాటు విచారించేందుకు సిద్ధమైంది.
మనీ లాండరింగ్, హవాల వ్యవహారాలు టాలీవుడ్ సెంట్రిక్‌గా టాలీవుడ్‌లో మరోసారి కలకలం చెలరేగింది. నాలుగేళ్ల క్రితం నాటి డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి ఎందుకు వచ్చింది? ఆ 12 మందికి నోటీసులు సర్వ్ చేయడంలో ఉద్దేశమేంటి? వారి నుంచి ఈడీ ఎలాంటి సమాచారం రాబట్టబోతుంది? డ్రగ్స్ నిషా కక్కించబోతుందా? ఈడీ నోటీసులిప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి.
బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం, సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం చుట్టూ చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం దగ్గర ఆగింది. రియా చక్రవర్తి 25 మంది బాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లు బయటపెట్టింది. ఇందులో సారాఅలీ ఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబాటా, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు బయటకు వచ్చాయి.