సమాజంలో మానవరూపంలో ఉండే మృగాలు ఎక్కువైపోయారు. వయసుతో సంబంధం లేకుండా దాడులకు పాల్పడుతున్నారు. ఇక్కడ చెప్పుకోబోయే ఓ దుర్మార్గుడు అభం.. శుభం తెలియని ఓ చిన్నారిని ఏడు నెలలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తల్లి కూడా చూస్తూ ఉంటోంది తప్ప ఎదురు చెప్పడం లేదు. పాప ఏడ్చినా.. ఎంత బాధపడినా అతను మాత్రం మృగంలా దాడి చేస్తూనే ఉన్నాడు.
ఇదీ చదవండి: భర్త కళ్ళ ముందే భార్యకి అవమానం..! కుర్రాళ్లంతా కలిసి!
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం కొత్తపేటలో వెలుగు చూసింది. కొత్తపేట సమీపంలో ఉంటున్న 26 ఏళ్ల వివాహితను భర్త వదిలేశాడు. ఆమెకు రెండేళ్ల చిన్నారి ఉంది. కూలీనాలీ చేసుకుంటూ కుమార్తెను పోషిస్తోంది. ఓ రోజు నెల్లిమర్లలో ఓ శుభకార్యానికి వెళ్లింది. అక్కడ ఆమెకు చిన్నా అనే ఒక ప్రైవేటు ఎలక్ట్రీషియన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే చిన్నా ఎప్పుడూ మహిళ కుమార్తెను చేరదీయలేదు. ఎప్పుడూ ఆమెను కొడుతూ ఉండేవాడు.
కొన్నాళ్ల తర్వాత అతని చేష్టలు శ్రుతి మించాయి. చిన్నారిని కొరకడం, రక్కడం మొదలు పెట్టాడు. విచక్షణారహితంగా ఆ చిన్నారిని హింసించడం చేస్తున్నాడు. బుధవారం రాత్రి తల్లి ఇంట్లో లేని సమయంలో చిన్నారి బుగ్గలు, కాళ్లు, చేతులు కొరికేశాడు. తల్లి వచ్చేసరికి చిన్నారి ఏడుస్తూ ఉంది. చుట్టుపక్కల వాళ్లు ఏమైందని అడగగా తల్లి దాటవేసింది. ఆ తర్వాత విషయం అంగన్ వాడీ సిబ్బందికి తెలిసింది. స్థానిక మహిళా సంరక్షణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. తల్లిని వ్యక్తిత్వ, మానసిక నిపుణుల వద్దకు కౌన్సిలింగ్ కు పంపుతామన్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.