ఈ సమాజంలో నేరాల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా, ఎన్ని కఠిన శిక్షలు అమలు జరుగుతున్నా కొన్ని ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన అత్యంత కిరాతకమైంది. ఓ యువకుడి పురుషాంగం కోసేసి, అతని కళ్లు పీకేసి, అతని పొట్ట, ఛాతీ భాగంలో కత్తితో తూట్లు పొడిచిన ఆనవాలు ఉన్నాయి. అతను ఎవరో? ఎందుకు హత్య గావించబడ్డాడు? అనే వివరాలు ఏం తెలీదు. ఈ కేసు పోలీసులకు పెద్ద సవాలు విసురుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాందాలో చోటుచేసుకుంది. బిసాండా పీఎస్ పరిధి పునాహుర్ గ్రామంలోని ఎక్స్ ప్రెస్ హైవే సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు పరిశీలించారు. అది ఓ యువకుడి మృతదేహం. అతని వయసు 26 వరకు ఉంటుంది. ఆ శవాన్ని పరిశీలించిన పోలీసులు షాక్ కు గురయ్యారు.
ఆ శవానికి కళ్లు పీకేసి ఉన్నాయి. పురుషాంగం కట్ చేసి ఉంది. ఒళ్లంతా కత్తి పోట్లు. పొట్ట, ఛాతీ భాగంలో లోతైన కత్తి గాయాలు ఉన్నాయి. ‘అతను ఎవరు ఏంటి అనే వివరాలు ఏమీ దొరకలేదు. అతని పేరు, ఊరు తెలిసినా మా విచారణ వేగం పుంజుకుంటుంది. ప్రస్తుతానికి హత్య ఇక్కడే జరిగిందా? ఎక్కడన్నా హత్య చేసి ఇక్కడ పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కడుపులో బిడ్డను అబ్బాయిగా మారుస్తానంటూ.. నకిలీ బాబా అమానుషం..