సమాజంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే విలువలు, వావివరసలు అనే పదాలను అపహాస్యం చేస్తున్నట్లుగా ఉంది. ఆస్తి కోసం అన్నాదమ్ముల మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతోంది. అందుకు తమ్ముడిపై అన్న, వదిన కక్ష పెంచుకున్నారు. ఓరోజు గొడవ పెట్టుకుని పదునైన వస్తువుతో మరిదికి వదిన ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేసింది. అడ్డుకోబోయిన అత్తపై కూడా దాడికి దగింది. తీవ్ర గాయాలతో వారు ఆస్పత్రిలో చేరారు.
ఇదీ చదవండి: ప్రియుడితో పనిలో బిజీగా ఉన్న భార్య.. భర్త సడెన్ ఎంట్రీతో..
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లోని బాదల్ నివాడా గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు తల్లితో కలిసి ఉంటున్నారు. పెద్ద అబ్బాయికి వివాహం జరిగింది. భార్యతో కలిసి అదే ఇంట్లో ఉంటున్నారు. రెండో అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు. అతనికి పెళ్లి అయ్యేలోపే వీరు ఆస్తి పంపకాలు చేసుకోవాలని అనుకున్నారు. అలా అయితే వారికే కాస్త ఎక్కువ వాటా తెచ్చుకోవచ్చని. అలా వారు భావించగా.. అందుకు తమ్ముడు అంగీకరించలేదు. తనకు కూడా సమానంగానే వాటా రావాలని పట్టుబట్టాడు.
ఆ విషయంలో వారికి తరచూ గొడవలు జరగుతుండేవి. ఆస్తి విషయంలో అన్నా, వదిన అతనిపై కక్ష పెంచుకున్నారు. ఓరోజు ఆరుబయట మంచంపై సేదతీరుతున్న మరిదితో వదిన గొడవకు దిగింది. వారి మధ్య గొడవ తీవ్రమైంది. కోపంతో ఊగిపోతూ వదిన పదునైన వస్తువుతో మరిదిపై దాడి చేసింది. అడ్డొచ్చిన అత్తను కూడా వదల్లేదు. ఆమెపై కూడా విచక్షణారహితంగా దాడి చేసింది. మరిదికి ఆ దాడిపై మర్మాంగానికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మరిది ఫిర్యాదుతో వదినపై కేసు నమోదు చేశారు. వదిన కూడా తనను వేధిస్తున్నాడంటూ మరిదైప కేసు పెట్టింది. వీరి ఆస్తి గొడవలతో స్థానికులు షాకయ్యారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.