భర్తతో సంతోషంగా గడపాల్సిన కొందరు వివాహితలు పక్కచూపులు చూస్తూ భర్తకు టాటా చెబుతున్నారు. ఇలా ఇంటి సంసారాలను కాదని పరాయి వాడితో ఎంచక్కా రొమాన్స్ కు జెండా ఊపుతూ వివాహేతర సంబంధాల్లో ఎంజాయ్ చేస్తున్నారు కొందరు మహిళలు. అచ్చం ఇలాంటి ఘటనలోనే భర్తని కాదని వెళ్లిన ఓ భార్య చివరికి ప్రాణాలు విడిచిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తంజావూరు జిల్లాలోని పట్టుకోటై లెట్సాతోప్పు గ్రామం. ఇదే ఊరిలో నివాసం ఉండే సెల్లాదురై,ఇందుమతి అనే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి ఇంట్లో వాళ్లకి నచ్చకపోవడంతో కొంత కాలం ఇరువురి కుటుంబాలకు దూరంగా ఉన్నారు. కాగా రోజులు గడుస్తున్న కొద్ది భార్య ఇందుమతి ప్రవర్తన వక్రమార్గంలోకి వెళ్లింది. తను పని చేసే చోట ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఎంచక్క భర్తను కాదని ప్రియుడితో సరసాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తెగ ఎంజాయ్ చేస్తుంది.
మీరు ఈ క్రైమ్ వార్తలు చదివారా?
ఇక భార్య సాగిస్తున్న ప్రేమాయణం ఇటీవల భర్త చెవిన పడింది. దీంతో భర్త భార్యను రెండు మూడు సార్లు మందలించే ప్రయత్నం చేశాడు. అయినా భార్య ఇందుమతి ప్రవర్తనలో అస్సలు మార్పు రాలేదు. ఇక ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు సైతం జరిగేవి. ఇటీవల భార్యాభర్తల మధ్య వివాదం తారా స్థాయికి వెళ్లడంతో భర్త చేయి చేసుకున్నాడు. దీంతో ఇక్కడ ఉండనని భావించి భార్య ఇందుమతి తన అక్కింటికి వెళ్లింది. ఇక విసుగుచెందిన గత బుధవారం భర్త భార్య ఉంటున్న వదిన ఇంటికెళ్లి భార్యతో గొడవకు దిగాడు.
వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగి వివాదం తీవ్ర స్థాయిలోకి వెళ్లింది. ఇక భర్త కోపం కట్టలు తెంచుకోవడంతో భార్యను బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని నిందితుడు సెల్లాదురైని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.