అక్రమ సంబంధం, అనుమానం ఇలాంటి పదాలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. అది అనుమానమా? అక్రమ సంబంధమా? అన్న దానిపై క్లారిటీ వచ్చినా రాకపోయినా కూడా.. ఎండ్ రిజల్ట్ మాత్రం నేరమే అవుతోంది. ఓ భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరెవరితోనే అక్రమ సంబంధం పెట్టుకుందని. అతని అనుమానాన్ని బలపరుస్తూ ఆ భార్య ఓ రోజు వేరే యువకుడితో ఇంట్లో దొరికింది. ఇంకేముంది అప్పటికే అనుమానంతో ఉన్న భర్త ఆ భార్యను, యువకుడిని ఇంట్లో స్తంభానికి కట్టేసి కట్టెతో దాడి చేశాడు. ఆమెను వివస్త్రను చేశాడు. ఆ తర్వాత ఆమెకు గుండు కూడా గీశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ పాధా పీఎస్ పరిధిలో రాకేశ్- రమ(పేర్లు మార్చాం) దంపతులు నివాసముంటున్నారు. కొన్నాళ్లు బాగానే సాగిన కాపురంలో అనుమానాలు మొదలయ్యాయి. రమపై రాకేశ్ కు అనుమానం మొదలైంది. ఆమెను మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని రాకేశ్ భావించాడు. ఆమెపై నిఘా పెట్టిన రాకేశ్ ఓ రోజు ఇంట్లో ఆమె మరో యువకుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. రాకేశ్ కు కోపం కట్టలు తెంచుకుంది. భార్య- ఆ యువకుడిని ఇంట్లోనే కట్టేశాడు. రాకేశ్, అతని మిత్రుడు ఇద్దరూ కలిసి వాళ్లను కర్రలతో అతి దారుణంగా దాడి చేశారు.
వారి కేకలకు చుట్టుపక్కలున్న వారంతా వచ్చారు. ఆ ఘటనను ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జనాన్ని చూసి మరింత రెచ్చిపోయిన భర్త ఆమెను వివస్త్రను చేశాడు. ఆ తర్వాత ఆమెకు గుండు కొట్టాడు. కొట్టొద్దని ఆమె వేడుకుంటున్నా కూడా వినలేదు. స్థానికులు కూడా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. అతనికి బంధువులు కూడా వత్తాసు పలికారు. ఈ వార్త పోలీసులకు చేరడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన భర్త రాకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబసభ్యులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రమ, యువకుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ఆ పని చేస్తున్నాడని అన్ననే హతమార్చిన తమ్ముడు!
భార్య నిజంగానే అక్రమసంబంధం పెట్టుకుందా? లేక భర్త అనుమానంతో అలా కొట్టాడా? అనే ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే రాకేశ్ కే కాదు అలాంటి వారందరినీ పోలీసులు హెచ్చరించారు. భార్య తప్పు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి. విచారణ జరిపి సరైన న్యాయం మేం చేస్తాం. అంతేగానీ ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేస్తే సహించం అంటూ హెచ్చరించారు. రాకేశ్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. పారారైన వారికోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.