కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగాడి చేతికి చిక్కిన ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. పక్కింట్లో ఉండే వ్యక్తి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలోని పూరిలో చోటుచేసుకుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్రిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. పూరికి చెందిన మహేశ్ అనే వ్యక్తి డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. బాధిత బాలిక ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. అప్పటివరకు చాలా మంచి వాడిగా కనిపించిన వ్యక్తి.. ఇంట్లో ఎవరు లేరని గ్రహించడంతో మృగంగా మారిపోయాడు. తన కామ వాంఛ తీర్చుకునేందుకు.. ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మేడపేకి తీసుకెళ్లి నీఛమైన పనికి ఒడిగట్టాడు. పాప కేకలు వేయడంతో తల్లి మేడ మీదకు వెళ్లగానే అక్కడి నుంచి పారిపోయాడు.
చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. పాప ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ మృగాడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు మహేశ్ జగత్ సింగ్ పూర్ జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.