సమాజంలో చాలా మందికి ఉన్న దానితో సంతృప్తి చెందడు రాదు. అప్పు చేసి పప్పు కూడు తినాల్సిందే అనే ధోరణి ఎక్కువ. అలా చేస్తే ఎంజాయ్ మెంట్ ఏమో గానీ.. పనిష్మెంట్లు మాత్రం తప్పవు. వడ్డీ కోసం ఆశపడి అప్పు ఇచ్చిన వాడు దానిని తిరిగి రాబట్టుకోకుండా ఉండడు కదా. అలాంటి క్రమంలో చాలాసార్లు అప్పు చేసిన వారికి కష్టాలు తప్పవు. ఇక్కడ మాత్రం అలా జరగలేదు. అప్పు చేసింది భర్త అయితే భార్యకు అవమానాలు జరిగాయి. ఆ బాధ తట్టుకోలేక ఆమె ప్రాణాలు తీసుకుంది.
వివరాల్లోకి వెళ్లే.. కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురం పరిధి నెలమంగలలో మధుకుమార్- అఖిల(35) దంపతులు నివాసముండేవారు. మధుకుమార్ అదే ప్రాంతానికి చెందిన చందన్ అనే వ్యక్తి వద్ద రూ.లక్ష అప్పు చేశాడు. మధు సకాలంలో ఆ అప్పు చెల్లించలేదు. చందన్ ఇంటికి వచ్చి తరచూ దూషించేవాడు. అఖిలను కూడా తక్కువ చేసి మాట్లాడుతుండేవాడు. మధుకుమార్ ను వదిలేసి అఖిలను టార్గెట్ చేసి వేధిస్తుండేవాడు. ఆ తర్వాత పోలీసులను కూడా ఇన్వాల్వ్ చేశాడు. చందన్ మాటలు నమ్మి అఖిలను పీఎస్ కు పిలిచి హెచ్చరించారు. ఆ వేధింపులు తాళలేక, మనస్తాపంతో అఖిల ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఆ తర్వాత సూసైడ్ నోట్ రాసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.