సమాజంలో అక్రమ సంబంధం, హత్యలు అనేవి చాలా పెరిగిపోయాయి. అకారణంగా కూడా ప్రాణాలను తీసేస్తున్నారు. ఇంకొందరు అయితే కట్టుకున్న వారిని కాదని పరాయి వాళ్లతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. వారి బంధానికి అడ్డొస్తే కాటికి పంపడానికి కూడా వెనుకాడటం లేదు.
ప్రస్తుతం సమాజంలో కొందరు అక్రమ సంబంధం పెట్టుకోవడం ఏదో ప్యాషన్ లాగా ఫీలైపోతున్నారు. కట్టుకున్న వాళ్లతో కంటే పరాయి వారితోనే పడక సుఖాన్ని పంచుకోవాలని తహతహలాడుతున్నారు. వారి సంబంధానికి అడ్డుగా వస్తే కట్టుకున్న వాళ్లని కూడా కడతేరుస్తున్నారు. కొందరు తప్పు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం అనుమానం అనే జబ్బుకు బలైపోతున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది అలాంటి కోవకు చెందిన ఘటనే. కట్టుకున్న భార్య మీద అనుమాతంతో ఓ దుర్మార్గుడు కన్న బిడ్డలను కడతేర్చాడు. తన పిల్లలే కాదంటూ ఇద్దరు కుమారులను కడతేర్చాడు.
రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకా జక్లేర్ దొడ్డిలో నింగప్ప, ప్రభావతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. కూలిపనులు చేసుకుంటూ వీరు జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి రాఘవేంద్ర(5), శివరాజ్(3) ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే అతనికి భార్యపై అనుమానం ఉండేది. ఆమె ఎవరితోనే అక్రమ సంబంధం పెట్టుకుందని భావించేవాడు. అది విషయంలో తరచూ ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు. ఎవరో ఒకరితో ఆమెకు అక్రమ సంబంధం అంటగడుతూ ఉంటేవాడు. ఇటీవల అదే విషయంపై మరోసారి భార్యతో గొడవకు దిగాడు. ఈసారి అతను వారి పిల్లల పుట్టకనే శంకించాడు. తన ఇద్దరు కుమారులు అసలు తనకే పుట్టలేదనే నిర్ణయానికి వచ్చాడు.
ఆదివారం ఉదయం కె.ఇరబగేరలో అవ్వ ఇంట్లో ఉన్న పిల్లలను బైక్ పై ఎక్కించుకుని జక్లేర్ దొడ్డి శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ పిల్లలు ఇద్దరిని గొంతు నులిమి హత్య చేశాడు. వారి మృతదేహాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అనుమానంతో పిల్లలను హత్యచేశాడని తెలిసి భార్య, బంధువులు రోధించారు. అబంశుభం తెలియని పిల్లలను హతమార్చాడని గుండెలవిసేలా విలపించారు. భార్య దేవదుర్గ ఫిర్యాదుతో నింగప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి కిరాతకుడికి వారికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.