అమ్మానాన్న భిక్షాటన చేస్తారు. ఆకలైతే అన్నం పెట్టేవాళ్లు లేరు. ఏడిస్తే ఆడించేవాళ్లు లేరు. మూడేళ్ల చిన్నారి ఆకలితో బ్రెడ్ కొనుక్కోవడానికి రోడ్డుపైకి వచ్చింది. పొద్దున్నే పూటుగా తాగి రోడ్డుపైకి వచ్చిన ఓ వృద్ధుడు ఆమెకు చాక్లెట్ ఇచ్చి తనతో తీసుకెళ్లాడు. ముళ్ల పొదల్లో పిల్ల బట్టలు తీసేసి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. పాప కేకలు వేయడంతో స్థానికులు చూసి ఆ వృద్ధుడికి దేహశుద్ధి చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన కనకయ్య(65) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. అతనికి మద్యం తాగే అలవాటు కూడా ఉంది. ఆ రోజు పొద్దున్నే పూటుగా మందు తాగి రోడ్డుపైకి వచ్చాడు. అటుగా కిరాణ కొట్టు దగ్గర బ్రెడ్ కొనుక్కుంటున్న మూడేళ్ల చిన్నారిని చూశాడు. ఆమెకు చాక్లెట్ కొనిచ్చి వెంట తీసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక ముళ్ల పొదలు కనిపించాయి. పాపను ఆ పొదల్లోకి తీసుకెళ్లాడు. ఆమె బట్టలు విప్పేశాడు. అతను కూడా బట్టలు తీసేశాడు. భయమేసి ఆ పాప గట్టిగా కేకలు వేసింది. అటుగా వెళ్తున్న ఇద్దరు స్థానికులు ఆ కేకలు వినిపించిన చోటుకు పరుగెత్తారు.
అక్కడ చూస్తే బట్టలు లేకుండా కనకయ్య కనిపించాడు. పాపకు కూడా ఒంటిపై బట్టలు లేవు. వెంటనే ఆ పాపను కాపాడి.. కనకయ్యకు దేహశుద్ధి చేశారు. ఆ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. వెంటనే పోలీసులు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. పాప కేకలు వేయకపోయినా.. సమయానికి ఆ ఇద్దరూ చోటుకు వెళ్లకపోయిన పెద్ద ఘోరం జరిగిపోయేదని స్థానికులు అంటున్నారు. మరో చిన్నారి జీవితం నాశనం అయ్యేదని భావిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మరిదిపై కన్నేసిన వదిన.. పడక సుఖం కోసం పగ పట్టి..!