ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఈ మద్య గన్ కల్చర్ పెరిగిపోతుంది. కారులో వచ్చిన ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన మాదాపూర్ లో ఉదయాన్నే జరిగింది. కాల్పుల అనంతరం బైక్ పై పరారయ్యాడు. దుండగులు జరిపిన కాల్పుల్లో రియల్ ఎస్టెట్ వ్యాపారి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్.. మాదాపూర్‌లో తెల్లవారుజామున రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించిన వివాదం పరిష్కారానికి ఇస్మాయిల్‌ను నీరూస్ వద్దకు మహ్మద్ పిలిచాడు. పరస్పరం చర్చలు జరుగుతున్న సమయంలోనే.. మహ్మద్ ఫైరింగ్ ప్రారంభించాడు. అదే సమయంలో ఇస్మాయిల్ పక్కన వారిని చెదరగొట్టేందుకు మరో వెపన్‌తో జిలానీ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా కాల్పులు మోతెక్కడంతో ఆ దారిన వెళ్తున్న వాహనదారులు భయంతో వణికిపోయారు.
ఈ కాల్పుల్లో జిలానీ, మహ్మద్ కాల్పుల్లో ఇస్మాయిల్‌కు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలం నుంచి బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఇస్మాయిల్ ని ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోపు మరణించినట్లు తెలుస్తుంది. ఇస్మాయిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో జహంగీర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీం తో పర్యవేక్షిస్తున్నారు. ఆస్తి గొడవల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.