కన్న బిడ్డకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లి విలవిల్లాడి పోతుంది. నవ మాసాలు మోసి, కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎవరు ఏ చిన్నా మాట అన్నా అస్సలు సహించదు తల్లి. కానీ, ఇప్పుడు చెప్పబోయే తల్లి మాత్రం ఆ కేటగిరీకి చెందినది కాదు. మొగుడిపై కోపంతో ముక్కు పచ్చలారని పసికందు ప్రాణం బలితీసుకున్న మహాతల్లి. 8 రోజులపాటు మృత్యువుతో పోరాడి.. ఓటమిని అంగీకరించి తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. ఈ దుర్ఘటన హైదరాబాద్ లోని హయత్ నగర్ ప్రాంతంలో జరిగింది. రమావత్ వెంకటేశ్, రమావత్ సువర్ణలకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఏడు నెలల కుమారుడు ఉన్నారు. వీళ్లిద్దరూ నిత్యం కీచులాడుకుంటూనే ఉంటారు. ఓ రోజు చిన్న గొడవ కాస్తా.. చినికి చినికి గాలివానగా మారింది. వెంకటేశ్ భార్యతో గొడవ పడి బయటకు వెళ్లిపోయాడు. భర్తపై కోపంతో ఇంక బతకాలి అనుకోలేదు. వెంటనే ఇంట్లో ఉన్న శానిటైజర్ ఏడు నెలల బాబు, తనపై పోసుకుని నిప్పంటించుకుంది.
ఇంట్లోంచి అరుపులు, కేకలు వినిపించడంతో.. చుట్టుపక్కల వారు వచ్చి వారిని ఆస్పత్రికి తరలించారు. బిడ్డ పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకి తరలించారు. 8 రోజులపాటు మృత్యువుతో పోరాడి ఆ బాబు బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. తల్లి గాయాలతో బయటపడింది. బాబు నానమ్మ ఫిర్యాదుతో సువర్ణపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.