ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లైన భర్తలు భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఎంచక్క భార్యకు తెలియకుండా పరాయి యువతితో సినిమాలు, షికారులు అంటూ తిరుగుతూ చివరికి భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
ఇక పూర్తి స్టోరీలోకి వెళ్తే.. జగద్గిరిగుట్టకు చెందిన అనిల్ తో రమేశ్వరి అనే మహిళకి గతంలోనే వివాహం జరిగింది. కొంత కాలం పాటు వీరి సంసారం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే కొన్ని రోజుల నుంచి భర్తపై భార్యకు అనుమానం ఉండడంతో ఓ సారి కన్నేసి ఉంచింది. కాగా ఇటీవల భర్త మరో యువతితో తెర వెనుక సంసారాన్ని నడిపిస్తున్నాడని అనుమానంతో కుత్బుల్లాపూర్ బ్యాంక్ కాలనీలో నివాసిస్తున్న భర్త వద్దకు పోలీసుల సాయంతో వెళ్లింది.
పక్కా ప్లాన్ తో అడుగుల వేసిన వివాహిత ఎట్టకేలకు భర్త మరో యువతితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్థానిక పోలీసులకు ముట్టజెప్పింది. ఇక భర్తపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే భార్య ఉండగా పరాయి యువతితో ఎఫైర్ కొనసాగించిన ఇతగాడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.