సృష్టిలో ఏ తల్లికైనా తనకు ఎందరు పిల్లలు ఉన్న అందరు సమానమే. ఆ పిల్లల్లో ఒకరికి బాధ వస్తే వారే బాధ పడతారేమో కానీ కన్న తల్లి మాత్రం ఏ ఒక్కరికి కష్టం వచ్చిన తన మనస్సు అల్లాడుతుంది.అలాంటి ఓ తల్లి మంచానికే పరితమైంది. తన ఇద్దరు కుమారులు తాగిన మైకంలో ఆమె కళ్లెదుటే ఘర్షణ పడ్డారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె వారిని వారించలేకపోయింది. ఈ ఘర్షణలో పెద్ద కుమారుడు చనిపోయాడు. విషయం ఎవరికి చెప్పాలో తెలియక కొడుకు మృతదేహం పక్కనే జీవచ్ఛవంలా కొన్నిగంటల పాటు ఆమె మౌనంగా రోదించింది. ఈ హృదయ విషాదకరమైన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన వెంకట శ్రీమన్నారాయణ, వరలక్ష్మి దంపతులు, ఛాన్నాళ్లు క్రితం ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చారు. వీరికి భరత్(35), సాయితేజ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దుండిగల్ ఎయి ఫోర్స్ అకాడమీలో పనిచేసిన శ్రీమన్నారాయణ కొద్దికాలం క్రితం చనిపోయారు. వరలక్ష్మి పక్షవాతంతో మంచాన పడింది.ఇద్దరు కుమారులు జులాయిగా తిరుగుతూ మద్యం మత్తులో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మరోసారి వీరిద్దరు గొడవపడ్డారు. ఈ సమయంలో తమ్ముడు సాయి కుక్కర్ తీసుకుని బలంగా కొట్టడంతో అన్న భరత్ కిందపడిపోయాడు.
తర్వాత మత్తులో ఉన్న తమ్ముడు తల్లి మంచం పక్కనే నిద్రపోయాడు. శనివారం ఉదయం చూసేసరికి అన్న చనిపోయి ఉండటంతో భయంతో పారిపోయాడు. అనంతరం ఓ స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి కదల్లేని పరిస్థితుల్లో ఉండడంతో భరత్ అత్యక్రియలు నిర్వహించేవారు లేక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. మద్యం, మత్తు పదార్థాలు తీసుకోవడంతో సొంత అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగి చివరికి వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.