ఇటీవల విమానంలో మహిళపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటన అందరికి తెలిసిందే. ఆ ఉదంతాన్ని మరువక ముందే మరో దారుణ ఘటన చోటుచేసుకంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై యువకుడు మూత్రం పోశాడు.
ఈ మధ్య కాలంలో విమానాలు, బస్సులు, రైళ్లలో గొడవలు, అసభ్యకర సంఘటనలు ఎక్కువయ్యాయి. తరచుగా ఏదో ఒక సంఘటన వార్తల్లో వస్తోంది. కొందరు ప్రయాణ సమయంలో మహిళల పట్ల అసభ్య ప్రవర్తిస్తుంటారు. అంతేకాక శృతిమించి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు. ఇటీవల విమానంలో ఓ మహిళ ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన అందరికి తెలిసిందే. ఆ ఉదంతాన్ని మరవక ముందే అచ్చం అలాంటి దారుణమే మరోకటి చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మహిళపై ఓ యువకుడు మూత్ర విసర్జన చేశాడు. ఈ దారుణమైన ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రంలో విజయపుర నుంచి మంగళూరుకు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు మంగళవారం అర్ధరాత్రి ఓ దాబా వద్ద ఆగింది. బస్సు హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరు అనే ప్రాంతంలోని ఒక దాబా వద్ద టీ కోసం ఆగింది. ఎక్కువ మంది ప్రయాణికులు బస్సు దిగి..టీ తాగేందుకు దాబాలోకి వెళ్లారు. అయితే బస్సులో వెనుక 28వ నంబర్ సీటు కూర్చున్న రామప్ప(25) ముందుకు వచ్చాడు. బస్సు ముందు వరుసలో కూర్చుకున్న ఓ మహిళ గాఢ నిద్రలో ఉంది. రామప్ప ఆమె సమీపంలోకి వెళ్లి ఆమెపై మూత్రం పోశాడు. దీంతో నిద్రలో ఉన్న ఆమె ఒక్కసారిగా తుళ్లిపడి లేచి.. కేకలు పెట్టింది.బస్సులోని తోటి ప్రయాణికులు, బయట ఉన్న డ్రైవర్, కండక్టరు పరుగున ఆమె వద్దకు వచ్చారు.
నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అతడి సామాగ్రిని బయటపడేశారు. ఒకరిద్దరు ప్రయాణికులు రామప్పపై దాడి కూడా చేశారు. తోటి ప్రయాణికులు బాధిత మహిళను ఓదార్చారు. ఆమె దాబాలోని స్నానాల గదిలో వెళ్లి.. స్నానం చేసి, దుస్తులు మార్చుకునే వరకు బస్సును ఆపారు. నిందితుడు మద్యం మత్తులో ఉండి ఇలా చేశాడని ప్రయాణికులు భావిస్తున్నారు. అయితే ఆ మహిళ సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నిందితుడు మెకానికల్ ఇంజినీరింగ్ పట్టభద్రుడిగా గుర్తించారు. బస్సులో జరిగిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.