సంగారెడ్డి జిల్లా భగత్ సింగ్ నగర్ కు చెందిన బెంగరి కృష్ణవేణి, రాజాంపేటకు చెందిన తడ్కల్ అనిల్‌కు గత కొన్ని రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని, అన్యోన్యంగా జీవనం సాగిద్దాం అనుకున్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఆటంకాలు వస్తాయని ముందే భావించారు. అయినా ఒకసారి పెద్దవారికి చెప్పి చూద్దామని ఇరు కుటుంబాల పెద్దలను కలిశారు. ఇద్దరికీ వయసు మధ్య వ్యత్సాసం ఉందనీ, వేరువేరు కులాలు చెందిన వారు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు.
ఇది కూడా చదవండి : మూడేళ్ళ క్రితం చనిపోయిన మహిళ పుర్రె మిస్సింగ్!
అబ్బాయి కన్నా అమ్మాయి నాలుగేళ్లు పెద్దది కావడం, మరోవైపు వాళ్ళిద్దరి కులాలు వివాహానికి అడ్డురావడంతో బతికి విడిపోవడం కన్నా.. చనిపోయి కలిసిపోదాం అనుకున్నారు.ఇద్దరు రాయపల్లి బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.