ప్రతి మహిళకి తన పుట్టింటిపైన, తల్లిదండ్రులపైన ఎనలేని ప్రేమ ఉంటుంది. పుట్టింట్లో పులిసిపోయిన కూర తిన్నా కూడా అద్భుతమైనదిలా భావిస్తుంది. కారణం.. తన పుట్టింటిపై ఉండే మమకారం. అత్తింటివారు తనని ఎన్ని మాటలు అన్నా భరిస్తుంది.. కానీ తన వారిని ఒక్క మాట అంటే కూడా సహించదు. అత్తింటి నుంచి వెళ్లి..తన తల్లిదండ్రులతో గడిపే క్షణం కోసం ప్రతి ఆడపిల్లలు ఎంతగానో ఎదురు ఉంటుంది. తల్లిదండ్రులతో గడిపే ఆ సంతోషం కోసం కొందరు కోడళ్లు అత్తింటి వారిని సైతం ఎదిరిస్తుంటారు. తాజాగా ఓ మహిళ తనను పుట్టింటికి పంపించలేదని దారుణానికి ఒడిగట్టింది. మామ మర్మాంగాలను కత్తితో కోసి పడేసింది. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ బెంగాల్ లోని మైనాలోని తూర్పు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన శిఖా అనే మహిళకు వివాహం అయింది. భర్త, అత్తమామలతో కలిసి ఆ మహిళ ఉంటుంది. శిఖాకి పుట్టింటిపై ఎన్నలేని ప్రేమ. అక్కడ గడిపేందుకు, వారితో కలిసి ఉండే సుఖం కోసం ఆమె ఎప్పుడూ ఎదురు చూస్తునే ఉంటుంది. అందుకే శిఖా తన పుట్టింటి వారితో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండేది. దీంతో ఆమె పై అత్తమామలు , భర్త అనుమానం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక రోజు శిఖాకి.. ఆమె తండ్రి ఫోన్ చేసి.. ఇంట్లో మాంసాహారం వండామని తిన్నడానికి రమ్మని పిలిచాడు. దీంతో భర్తకు ఫోన్ చేసి.. విషయం చెప్పింది. వెళ్లొద్దని.. తానే చికెన్ తెస్తానని ఇంట్లోనే వండుకుని తిందామని భర్త తెలిపాడు. ఫోన్ మాట్లాడిన అనంతరం ఆ మహిళ కోపంతో ఊగిపోయింది. తన అత్తమామలతో వాగ్వాదానికి దిగింది. ఇరువురు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. ఇది కాస్తా భౌతికదాడి వరకు వెళ్లినట్లు సమాచారం.
ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన కోడలు.. విచక్షణ కోల్పోయి అత్తమామలపై దాడి చేసింది. అక్కడే ఉన్న కత్తితో తన మామ మర్మాంగాన్ని కోసి పడేసింది. దీంతో అతడు పెద్ద ఎత్తున కేకలు వేశాడు. ఆ అరుపులు విని అక్కడికి చేరుకున్న స్థానికులు..నొప్పితో విలవిలలాడుతున్న అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. భర్త వచ్చే వరకు పారిపోకుండా సదరు మహిళను బంధించగా.. తప్పించుకుని పుట్టింటికి పారిపోయింది. అనంతరం బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం విచారణ జరిపి.. ఆమెకు 14 రోజుల కస్టడీ విధించింది. ఈ ఘటనపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పుట్టింటికి పంపించకుంటేనే ఇంతటి దారుణానికి తెగబడతారా? అంటు స్థానికులు అభిప్రాయపడ్డారు.