కుటుంబంలో గొడవలు అనేది సర్వసాధారణం. ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య వాగ్వాదం జరుగుతుంది. అలానే కొన్ని కుటుంబాల్లో ఆడబిడ్డలకు, ఇంటి కోడలకి మధ్య మనస్పర్ధల కారణంగా వాగ్వాదం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ గొడవలు ప్రాణాలను కూడా బలి తీసుకుంటాయి. తాజాగా కేరళలో దారుణం చోటుచేసుకుంది.
కుటుంబంలో గొడవలు అనేది సర్వసాధారణం. ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య వాగ్వాదం జరుగుతుంది. అలానే కొన్ని కుటుంబాల్లో ఆడబిడ్డలకు, ఇంటి కోడలకి మధ్య మనస్పర్ధల కారణంగా వాగ్వాదం జరుగుతుంది. అయితే మరీ చంపుకునే స్థాయిలో వీరి కోపాలు ఉండవు. కొందరు మాత్రం హత్య చేయాలనే స్థాయికి కూడా వెళ్తుంటారు. అలాంటి ఘోరమైన ఘటన కేరళలో చోటుచేసుకుంది. అన్న భార్యను చంపాలనుకున్న ఓ మహిళ.. మేనల్లుడి చావుకు కారణమైంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో అరిక్కుళం అనే గ్రామంలో తాహిరా (38) అనే మహిళ నివాసం ఉంటోంది. ఈమె ఇంటి సమీపంలోనే సోదరుడు మహ్మద్ అలి.. భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. చాలాకాలం తాహిరా, ఆమె అన్న, వదినలు.. అందరూ చాలా సంతోషంగా కలిసి మెలసి ఉన్నారు. అయితే కొంతకాలం క్రితం తాహిరాకు, ఆమె వదినకు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తాహిరా తన వదినతో తరచూ గొడవపడేది.
ఈ కారణంగా ఆహారంలో విషం కలిపి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకుంది. సమీపంలోని షాప్ కి వెళ్లి,.. ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసింది. అనంతరం అందులో విషం కలిపిన తాహిరా సోదరుడి భార్యకు తినిపించాలని భావించి.. ఆమె ఇంటికి వెళ్లింది. తాహిరా వెళ్లిన సమయంలో ఇంట్లో ఆమె వదిన లేదు. దీంతో ఆ ఐస్‌క్రీమ్ ను అక్కడే వదిలి తిరిగి తన ఇంటికి వచ్చింది. అదే సమంయలో ఇంట్లో ఉన్న మేనల్లుడు అహ్మద్ హసన్ రిఫాయీ (12) ఆ ఐస్‌క్రీం తిన్నాడు.
ఆతరువాత కాసేపటికి వాంతులు చేసుకుంటూ కిందపడిపోయాడు. బాలుణ్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ బాలుడు సోమవారం మృతిచెందాడు. నిందితురాలు పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. ఇలా పెద్దలపై కోపంతో పిల్లల ప్రాణాల తీస్తున్న ఘటనలు నిత్యం అనేకం జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టే విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.