నేటికాలంలో కొంతమంది యువతలో మనోధైర్యం అనేది కొరవడుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొలేక భయపడిపోతున్నారు. ప్రతి సమస్యకు చావే పరిష్కారంగా భావిస్తున్నారు. చదువులో ఫెయిలైనా, లవ్ విఫలమైందని, ఉద్యోగం రాలేదని, పెళ్లి కాలేదని, తల్లిదండ్రులు అరిచారని, కొందరు హేళన చేశారని.. ఇలా ప్రతి విషయంలో మనస్తాపం చెందుతున్నారు. ఈ క్రమంలో ఈ కష్టాలు భరిచడం తమ వల్ల కాదని ఆత్మహత్యలకు పాల్పడి.. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముసిగిస్తున్నారు. తాజాగా యువతి..తాను సరిగ్గా చదువుల్లో రాణిచలేకపోతున్నానని, ఎస్సై పరీక్షల్లో కూడా ఎంపిక కాలేదని జీవితాన్ని బలితీసుకుంది. దీంతో ఆ యువతి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయితండాకు చెందిన రైతు తేజావతు జవహర్ లాల్, ఉపేంద్ర దంపతులకు శ్వేత(19), సానియా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద అమ్మాయి శ్వేత ఖమ్మంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్, చిన్న అమ్మాయి సానియా ఇంటర్మీడియెట్ చదవుతున్నారు. రోజూ డోర్నకల్ నుంచి ఖమ్మంకి వస్తుంటారు. జవహర్ లాల్ దంపతులు..తమకున్న ఎకరన్నర భూమిని సాగు చేసుకుంటూ కూతుళ్లను చదివిస్తోన్నారు. తాము కష్టపడినా..పిల్లలకు మంచి భవిష్యత్తు అందిచాలని వారు తలిచారు. అయితే ఇటీవల వచ్చిన డిగ్రీ పరీక్ష ఫలితాల్లో శ్వేత ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయింది. దీంతో ఆమె తీవ్రంగా కలత చెందింది. ఇదే సమయంలో ఇటీవల రాసిన ఎస్సై ఉద్యోగానికి సంబంధించిన ప్రాథమిక పరీక్షల్లోనూ శ్వేత అర్హత సాధించ లేకపోయింది.
దీంతో మంచిగా చదివి తల్లిదండ్రులకు అండగా ఉందామనుకున్నా.. తన కోరిక నిరవేరడం లేదని స్నేహితులతో చెప్పి శ్వేత బాధపడుతుండేది. తన చదువులకు ఇప్పటికే తల్లిదండ్రులు ఎక్కువ డబ్బులు ఖర్చు చేశారని, ఇంకా వారికి తాను భారం కావద్దని భావించింది. ఈ క్రమంలో ఈ నెల 16 ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగులు మందు తాగింది. అయితే వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా శుక్రవారం శ్వేత ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.