నిత్యం ప్రజలకు రక్షణగా ఉంటూ సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను పోలీసులు అరికడుతుంటారు. సమాజంలోని రౌడీ మూక, అసాంఘీక శక్తుల అరాచకాలను అరికడుతుంటారు. అందుకే ప్రజలకు పోలీసులంటే గౌరవం. అయితే కొందరు పోలీసులు చేసే పనులు మాత్రం ఆ వ్యవస్థ మొత్తానికి తలవంపులు తెచ్చిపెడుతుంటాయి. కొందరు పోలీసులు ప్రజలను లంచంతో పీడిస్తుంటే, మరికొందరు మహిళలతో అసభ్యకరంగా ఉంటుంటారు. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కొత్తకోట ఏఎస్ఐ రాసలీలలు బయటపడ్డాయి. పోలీస్ స్టేషల్ లో ఓ మహిళతో ఉండగా అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో కొత్త కోట పోలీస్ స్టేషన్ లో అప్పారావు ఏఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న అప్పారావు.. ఓ మహిళను ఏకంగా పోలీస్టేషన్ కు తీసుకెళ్లాడు. అక్కడే ఆ మహిళతో ఏఎస్ఐ రాసలీలలు జరిపాడు. అది గమనించిన స్థానికులు పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే కొత్తకోట పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఉన్నతాధికారులు ఏఎస్ఐ అప్పారావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారుల ముందు అడ్డగా దొరికిపోయిన ఏఎస్ఐ బిక్కముఖం వేశాడు. వెంటనే ఏఎస్ఐ సీఐ, ఎస్సైల కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. ఇదే సమయంలో అప్పారావు వెంట వచ్చిన మహిళ.. అక్కడి నుంచి మెల్లగా జారుకుంది.
మద్యం తాగడమే కాకుండా మహిళను తీసుకొచ్చి ఏకంగా పోలీస్టేషన్ లోనే ఇలాంటి ఆకృత్యానికి పాల్పడటంపై పోలీస్ అధికారులు చాలా సీరియస్ అయ్యారు. ఏఎస్ఐ అప్పారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను స్థానికులు, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే ఈ ఘటన విషయంలో ఏఎస్ఐపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.