సాధారణంగా కిడ్నాపర్లు.. ధనవంతుల కుటుంబ సభ్యులను ఎత్తుకెళ్లి.. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. అలానే బాధిత కుటుంబ సభ్యులు కూడా తమ వారిని ప్రాణలతో కాపాడుకునేందుకు కిడ్నాపర్లకి అడిగినంత డబ్బులు ఇస్తుంటారు. అయితే కొన్ని సార్లు కిడ్నాపర్లు మధ్యతరగతి కుటుంబాల పిల్లలను, ఇతర సభ్యులను కిడ్నాప్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో తమ వద్ద డబ్బులు లేకపోయినా.. ఇతరుల నుంచి అప్పుడుగా తీసుకుని మరీ.. కిడ్నాపర్లు అడిగిన అంత సొమ్ము ఇస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కిడ్నాపర్లకి డబ్బులు చెల్లించేందుకు ఓ ఊరంతా ఏకమైంది. వారికి డబ్బులు చెల్లించేందుకు ఊరంతా చందాలు వేసుకుంటుంది. మరి.. ఎందుకు ఆ ఊరంతా ఇలా చేయాల్సి వచ్చిందో, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ లోని శ్యోపూర్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన రామ్ స్వరూప్ యాదవ్, భట్టు బఘేల్, గుడ్డా బఘేల్ అనే ముగ్గురు వ్యక్తులను రాజస్థాన్ లోని ఓ నేరస్థుల ముఠా కిడ్నాప్ చేసింది. అయితే , తమకు రూ.15 లక్షలు చెల్లిస్తేనే ప్రాణాలతో విడిచిపెడతామని కిడ్నాపర్లు చెప్పారు. అయితే ఇక్కడ వచ్చిన అసలు సమస్య ఏంటంటే.. కిడ్నాప్ కి గురైన వారందరూ నిరు పేద కుటుంబాలకు చెందినవారే. దీంతో తమ కుటుంబ సభ్యులను ఎలా విడిపించుకోవాలో దిక్కుతోచని స్థితిలో వారు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ గ్రామస్థులు రంగంలోకి దిగారు. కిడ్నాపర్లు అడిగిన రూ.15 లక్షలను చెల్లించేందుకు వివిధ ప్రయత్నలు చేస్తున్నారు.
ఈ విషయంపై ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. తమ వద్ద భూమి లేదని, రూ.100, రూ.200, రూ.500.. ఇలా ఎవరికి సామర్ధ్యం మేరకు వాళ్లు ఇస్తున్నారని తెలిపాడు. అలా వచ్చిన డబ్బులను కిడ్నాపర్లకు చెల్లించి.. తమ వారిని కాపాడుకుంటామని గ్రామస్థులు అంటున్నారు. తమ గ్రామంలో పేద కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని, కిడ్నాప్ కి గురైన ఓ రైతు ఇంటికి కనీసం పై కప్పు కూడా లేదని ఆ గ్రామ మాజీ సర్పంచ్ సియారామ్ బఘేల్ తెలిపారు. మరోవైపు.. కిడ్నాపర్లను పట్టుకునేందుకు స్థానిక పోలీసులు, రాజస్థాన్ పోలీసులతో కలిసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. అలానే కిడ్నాపర్లపై రివార్డు కూడ ప్రకటించారు. వారి ఆచూకి తెలిపిన వారికి రూ.30 ఇస్తామని శ్యోపూర్ జిల్లా ఎస్పీ తెలిపారు.
మొదట్లో రూ.10 వేలుగా ఉన్న ఈ రివార్డును రూ.30 వేలకు పెంచుతూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారం ఇలా ఉంటే.. మధ్యప్రదేశ్ లోని చంబల్ పరిసర ప్రాంతంలో దోపిడీ ముఠాల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతం రాజస్థాన్ కి సరిహద్దు కావడంతో.. అక్కడి నుంచి కొన్ని ముఠాలు నేర కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. గతంలో కూడా శ్యోపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రైతును ఓ ముఠా కిడ్నాప్ చేసింది. డబ్బులు ఇచ్చిన అనంతరం ఆ రైతును ఊరి బయట వదిలేసింది. మరి.. ఇలా వరుస కిడ్నాప్ ఘటనలు స్థానికులను కలవర పెడుతోంది. ఈ ముఠాల నుంచి తమను కాపాడాలని స్థానికులను పోలీసులను వేడుకుంటున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.