ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే మానసికంగా కృంగిపోవడం.. డిప్రేషన్ లోకి వెళ్లిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడులు చేస్తున్నారు.. తమను తాము శిక్షించుకుంటూ చనిపోతున్నారు.
అబ్దుల్లాపూర్ మెట్ లో నవీన్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచనంగా మారిన విషయం తెలిసిందే. ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా తన ఫ్రెండ్ ని ముక్కలు ముక్కలు నరికి గుండె, తల, మొండెం వేరు చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటన మరువకముందే తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రేమోన్మాది తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. ఏకంగా ఆమె ఒంటిపై 16 కత్తిపోట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?
కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు లో దారుణఘటన చోటు చేసుకుంది. దినకర్ అనే యువకుడు కొంతకాలంగా ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అదే సమయంలో లీలా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొంత తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరూ ఐదు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పంచి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అభ్యంతరం చెప్పారు. ముఖ్యంగా లీలా తల్లిదండ్రులు కులాంతర వివాహం చేయడానికి ససేమిరా అన్నారు.
తన కుటుంబ సభ్యులను ఎదిరించే ధైర్యం చేయలేకపోయింది లీలా. ఈ క్రమంలోనే లీలా కొంతకాలంగా దినకర్ ని దూరంగా ఉంచడం మొదలు పెట్టింది. అది తట్టుకోలేక దినకర్ ఆమెపై కక్ష్య పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. లీలా జాబ్ చేసే కంపెనీ వద్ద వెయిట్ చేసి ఆమె రాగానే గొడవ పెట్టుకున్నాడు.. తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో 16 సార్లు విచక్షణారహితంగా పొడిచి చంపాడు. దీంతో లీలా అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడ ఉన్నవాళ్లంతా భయబ్రాంతులకు గురయ్యారు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హంతకుడైన దినకర్ ని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 5 ఏళ్లుగా ఇద్దరూ ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని.. వరుడు వేరే కులానికి చెందిన వ్యక్తి కావడంతో అమ్మాయి కుటుంబం పెళ్లికి సిద్ధపడలేదని.. దీంతో తనకు దక్కని యువతి ఎవరి సొంతం కావొద్దని హత్యచేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు.