ఓ మహిళా ఎస్సై సహకారంతో తల్లి, కొడుకు గలీజ్ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే గత కొంత కాలంగా గుట్టుగా ఈ పాడుపనులు జరుగుతున్నట్లుగా పోలీసులు తేల్చారు. అసలేం జరిగిందంటే?
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా ఎస్సై సహకారంతో తల్లి, కొడుకు గలీజ్ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే గత కొంత కాలంగా గుట్టుగా ఈ పాడుపనులు జరుగుతున్నట్లుగా పోలీసులు తేల్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలు అసలేం జరిగింది? ఆ మహిళా ఎస్సై సహకారంతో తల్లి, కొడుకు చేసిన ఆ గలీజ్ పనులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలో తిరుపతి జిల్లాలోని ఓ ప్రాంతంలో ఓ మహిళా ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆ మహిళా ఎస్సై కావడంంతో.. ఆమె కుటుంబ సభ్యులు వ్యభిచారాన్ని నిర్వహించాలని అనుకున్నారు. ఇందు కోసం ఆ మహిళా ఎస్సై కుటుంబ సభ్యులు ఆమెక్కడ ట్రాన్స్ ఫర్ అయితే అక్కడికి వెళ్లడం, స్థానిక ప్రాంతాల్లో ఓ గదిని అద్దెకు తీసుకుని దుకాణం పెట్టి గుట్టుగా వ్యభిచారాన్ని నిర్వహించడం. ఇక ఇదే పనిని ఈ తల్లి, కొడుకు గత కొంత కాలంగా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది
అయితే ఇదంతా గమనించిన కొందరు స్థానికులు ఇటీవల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పక్కా ప్లాన్ తో పోలీసులు ఆ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మహిళలతో పాటు ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఈ వ్యభిచారాన్ని నిర్వహించింది.. ఆ మహిళా ఎస్సై తల్లి, సోదరుడేనని పోలీసులు తెలిపినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఆ ఎస్సై తల్లి, సోదరుడి ప్రవర్తన నచ్చకపోవడం వల్లే.. చాలా రోజుల నుంచి వారి నుంచి దూరంగా ఉంటున్నట్లుగా ఆ మహిళా ఎస్సై చెప్పినట్లుగా సమాచారం. ఇక అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.