Crime News in Telugu: తప్పు చేసి తప్పించుకుని తిరగటం అన్నది అసాధ్యం.. దొరికిపోవటం కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ, దొరికిపోవటం మాత్రం పక్కా. కొంతమంది దొంగలు దొంగతనానికిపోయి ఇతరుల్ని గాయపర్చటం లేదా చంపేయటం చేస్తుంటారు. ఇంకా కొంతమంది పట్టుకుంటారన్న భయంతో పారిపోవటానికి ప్రయత్నించి గాయాలపాలవ్వటమో.. ప్రాణాలు కోల్పోవటమో జరుగుతుంటుంది. తాజాగా, ఓ దొంగ పోలీసులకు చిక్కుతానన్న భయంతో నాలుగో అంతస్తు మీదనుంచి కిందకు దూకాడు. ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన 26 ఏళ్ల రోహిత్ ఓ దొంగ. గురువారం రాత్రి వాఖండే స్టేడియానికి దగ్గరలోని డిరోడ్‌లోని ఓ ఇంటికి అపార్ట్‌మెంట్‌లోకి దొంగతనానికి వెళ్లాడు. రోహిత్ అక్కడి నాలుగో అంతస్తులో ఉండగా అపార్ట్‌మెంట్ వాచ్‌మ్యాన్ చూశాడు. గట్టిగా దొంగ, దొంగ అని అరుస్తూ పైకి పరిగెత్తాడు.
వాచ్‌మ్యాన్ అరుపులు విన్న అపార్ట్‌మెంట్ వాసులు కూడా అరుస్తూ పైకి వెళ్లారు. దీంతో రోహిత్ వారినుంచి తప్పించుకోవటానికి నాలుగో అంతస్తు సేఫ్టీవాల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలం మీదకు దూకాడు. అపార్ట్‌మెంట్‌లో దొంగ పడ్డ సమాచారం పోలీసులకు అందింది. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. రోహిత్ సేఫ్టీవాల్ పక్కనే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తనను పట్టుకోవటానికి వస్తే కిందకు దూకేస్తానని బెదిరించాడు. పోలీసులు, అపార్ట్‌మెంట్ వాసులు ఎంత చెప్పినా వినలేదు.
కింద అతడ్ని కాపాడటానికి ఓ వలను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే, రోహిత్ పోలీసులకు చిక్కుతానన్న భయంతో కిందకు దూకేశాడు. దీంతో అతడి శరీరం నేరుగా నేలను తాకింది. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Hyderabad: బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న కూతురు.. తల్లి ఏం చేసిందో తెలుసా?