పూజ, అరవింద్ భార్యాభర్తలు. పెళ్లైన చాలా కాలానికి వీరికి ఓ కూతురు పుట్టింది. ఆ పాపను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కూతురి రాకతో వారి జీవితంలో కొత్త శోభ సంతరించుకుంది. పుట్టిన కూతురిని చూసుకుంటూ ఆ దంపతులిద్దరూ ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఉన్నట్టుండి పూజ కూతురికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఉన్నదాంట్లో సర్దుకుని బతికే జీవితాలు కావడంతో పెద్ద ఆస్పత్రుల్లో చూపించే స్థోమత లేకపోయింది.
దీంతో కూతురిని ఎలా బతికించాలో తెలియక తల్లి పూజ మనస్థాపానికి గురై తాజాగా ఆత్మహత్యకు పాల్పడింది. హైద్రాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన పూజ, అరవింద్ ఇద్దరు దంపతులు. పెళ్లైన కొన్నాళ్లకి వీరు హైద్రాబాద్ అత్తాపూర్ లో పాండురంగా నగర్ లో రెండేళ్లుగా నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లకి వీరికి ఓ కూతురు పుట్టింది. ఇదిలా ఉండగానే కూతురి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో తల్లిదండ్రులు ఇటీవల వైద్యులను సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆ పాపకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని నిర్దారించారు.
ఇది కూడా చదవండి: Bihar: హేయ్.. నేను దుర్గామాతను, పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ.. వీడియో వైరల్!
ఈ వార్తతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పెద్ద ఆస్పత్రుల్లో చూపించడానికి వారి ఆర్థిక స్థోమత కూడా అంతంతే. దీంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. కూతురికి బ్రెయిన్ ట్యూమర్ రావడం, చూపించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో భార్య పూజ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఏం చేయాలో తెలియక పూజ తాజాగా ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనతో వీరి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.