సమాజంలో ఎంతోమంది యువత ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. రాబోయే రోజుల్లో కష్టాలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా అతడితోనే ఉంటామంటూ తెగేసి చెబుతున్నారు. చివరికి తల్లిదండ్రులను ఎదురించి లవ్ మ్యారేజ్ లు చేసుకుంటున్నారు. ఇక పెళ్లైన కొంత కాలం పాటు భర్తతో బాగానే సంసారం చేస్తారు. అలా పిల్లలు పుట్టి రెండు మూడేళ్లు గడిచాక కొందరు భర్తలు తమ అసలు రూపాన్ని బయటపెడుతున్నారు. ప్రతీ దానికి భార్యతో గొడవ పడుతూ సంసారాన్ని బజారుకీడ్చుకుంటున్నారు. ఇక సరిగ్గా ఇలాగే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ మహిళ తాజాగా షాకింగ్ డిసిషన్ తీసుకుంది. ప్రేమించిన వాడితో సుఖం దక్కలేదని దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
తమిళనాడు తెన్ కాశి జిల్లా వాసుదేవ నల్లూరు. ఇదే ప్రాంతంలో మురుగున్, మీనా దంపతులు నివాసం ఉంటున్నారు. గతంలో వీరిద్దరూ పెద్దలను ఎదురించి మరీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు బాగానే సంసారం చేశారు. అలా కొంత కాలం తర్వాత ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి ఈ భార్యాభర్తలు తరుచు గొడవ పడుతున్నారు. దీంతో స్థానిక ప్రజలు వీరికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ భర్త ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. అయితే మంగళవారం రాత్రి కూడా భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు. భర్త భార్యపై కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. భర్త తీరుతో విసిగిపోయిన మీనా తీవ్ర మనస్థాపానికి గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా అతనితో సుఖం లేదని వెక్కి వెక్కి ఏడ్చింది.
ఇక అదే రాత్రి మీనా తన ఇద్దరు పిల్లలను తీసుకుని స్థానికంగా ఉండే ఓ బావి వద్దకు వెళ్లింది. అక్కడికి వెళ్లాక తన ఇద్దరు పిల్లలను బావిలో తోసేసింది. ఆ తర్వాత మీనా కూడా అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఒక గంట తర్వాత భర్త ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో భార్యతో పాటు పిల్లలు కూడా కనిపించలేదు. దీంతో భర్త ఖంగారుపడి అటు ఇటు అంతా వెతికాడు. ఎంత వెతికినా భార్యా, పిల్లల ఆచూకి మాత్రం దొరకలేదు. కట్ చేస్తే బుధవారం తెల్లవారు జామున మీనా స్థానిక బావిలో దూకి చనిపోయిందని భర్త మురుగన్ కు స్థానికులు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న భర్త మురగన్ ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయాడు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.